📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

Mobile phone :పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మొబైల్ ఫోన్

Author Icon By Sudha
Updated: June 13, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని నిశ్శబ్దంగా(Quietly) ఉంచడానికి లేదా తినిపించడానికి మొబైల్ ఫోన్ చేతిలో పెడుతున్నారు. కానీ ఈ అలవాటు భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యానికి (health)తీవ్రంగా భంగం కలిగించే ప్రమాదం ఉంది.

Mobile phone :పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మొబైల్ ఫోన్

మెదడుపై ప్రభావం
ప్రస్తుతం చిన్న వయసులోనే పిల్లలు స్మార్ట్‌ ఫోన్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ సమాచారం తెలుసుకోవాలనే ఆశతో.. చిన్న వయసులోనే మొబైల్ వాడే అలవాటు చేస్తున్నారు. మరికొందరైతే పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా తినడం మానేస్తున్నప్పుడు.. వాళ్లను ఆపేందుకు ఫోన్ ఇస్తున్నారు. కానీ దీని పరిణామాలు పిల్లల మెదడు అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీయగలవని తెలియకపోవచ్చు. స్మార్ట్‌ ఫోన్ ఎక్కువసేపు చూడటం వల్ల చిన్నపిల్లల మెదడు అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల పిల్లల్లో దృష్టి నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది.. నిద్రలేమి, ఊబకాయం, కోప స్వభావం లాంటి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
నీలి కాంతితో కళ్లు పాడవుతాయి
అంతేకాదు ఎక్కువ శబ్దంతో వీడియోలు చూడటం వల్ల వారి చెవులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. మొబైల్ స్క్రీన్ నుండి వెలువడే నీలి కాంతి వల్ల కళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. దీన్ని చిన్న విషయం అనుకుంటే.. భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది.
పిల్లలు మొబైల్ చూడాలని మారాం చేస్తే లేదా ఏడుస్తుంటే ఫోన్ ఇవ్వడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీని వల్ల వారిలో దైనందిన జీవితంలో కూడా డిజిటల్ డిపెండెన్సీ పెరుగుతుంది. ఒకసారి అలవాటు పడ్డాక, ఫోన్ లేకపోతే మానసిక అసంతృప్తి, ఆందోళన మొదలవుతుంది.
అందుకే తల్లిదండ్రులు మొదటి నుంచే మొబైల్ వాడకాన్ని నియంత్రించాలి. వారి ఆత్మవిశ్వాసాన్ని, చురుకుదనాన్ని పెంపొందించే ఆటలు, కథలు, నేచర్ యాక్టివిటీలు లాంటి వాటిలో వారి దృష్టిని మళ్లించాలి. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు ఏడుస్తున్నారనే కారణంతో వారికి మొబైల్ ఇవ్వడం పొరపాటు. దీని ప్రభావం వారి ఆరోగ్యం, అభివృద్ధిపై దీర్ఘకాలంగా పడే అవకాశముంది. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు బాగా ఆలోచించి వారి భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

Read Also:Breathing: హఠాత్తుగా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయితే ఈ

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mobile phones Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.