📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Medicinal plants :ఔషధ మొక్కలతో చక్కటి ఆరోగ్యం, మెరిసే అందం మీ సొంతం

Author Icon By Sudha
Updated: July 2, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శతాబ్ధాల కాలం నుంచి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు మెడిసిన్‌గా వాడుతున్నారు. ఇవన్నీ మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో కొన్నింటిని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అలాంటి ఆయుర్వేద (Ayurveda)ఔషధ మొక్కలు (Medicinal plants)వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఔషధ మొక్కలతో చక్కటి ఆరోగ్యం, మెరిసే అందం మీ సొంతం

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ప్రకృతిలో లభించే అనేక రకాల మొక్కలు, చెట్లు ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. అటువంటి వాటిలో కొన్నింటిని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అలాంటి ఆయుర్వేద ఔషధ మొక్కలు (Medicinal plants)వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. పుదీనా ఆకులు.. వీటి వాసన చూస్తేనే మూడ్‌ అంతా రిఫ్రెష్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. వంటల్లోనూ మంచి రుచి, వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు. పుదీనా వంటల టేస్ట్‌ పెంచడానికే కాదు.. మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొన్ని పుదీనా ఆకులు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీ, సాస్, స్వీట్లు మొదలైన వాటికి రుచి, సువాసన కోసం దీన్ని కలుపుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఉబ్బరం తగ్గిస్తుంది. కరివేపాకు ఆకులలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, పీచు పోషకాలతోపాటు విటమిన్‌-సి, విటమిన్‌-బి, విటమిన్‌-ఇలు అధికం. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు పొందుతారు. మధుమేహులకు ఇది సరైన ఆహారం. నాడీసంబంధిత వ్యాధుల్నీ, క్యాన్సర్లనీ అడ్డుకుంటుందట. ఇందులో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికం
సువాసనతో కూడిన మొక్క లెమన్ గ్రాస్. దీన్ని టీ, సూప్, థాయ్ వంటకాల్లో వాడతారు. ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షిస్తుంది. లెమన్ గ్రాస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌‌ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది. ఈ లెమన్ గ్రాస్‌లో అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. వ్యాధులు, రోగాలతో పోరాడే శక్తిని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలకు ప్రసిద్ధి చెందినది గిలోయ్. ఇది శరీర ఉష్టోగ్రతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తిప్పతీగ లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ ఔషధ మొక్కలు (Medicinal plants)తిప్పతీగ ఆకులను రోజుకు రెండు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచి ఎక్కువ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

ఔషధ మొక్కలతో చక్కటి ఆరోగ్యం, మెరిసే అందం మీ సొంతం

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంటుంది. వారిలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి ముంగిట తులసి చెట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ తులసి చెట్టుకు నీరు పోసి ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే, తులసి మొక్క కేవలం మతపరమైన ప్రాముఖ్యతలకు మాత్రమే కాదు..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. తులసికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దగ్గును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Read Also:Cramps: ఈ చిట్కాలతో తిమ్మిర్లు మాటు మాయం

#ArogyamAushadhaMokkalu #AyurvedicPlants #BeautyNaturally #HealthWithPlants #HerbalHealing #homeremedies #MedicinalPlants #NaturalRemedies #TeluguAyurveda Ayurvedic plants for common diseases Best herbal plants for home garden Breaking News in Telugu Google news Google News in Telugu How to grow herbal plants at home Latest News in Telugu List of medicinal plants used in Ayurveda Medicinal plants for glowing skin Natural remedies using medicinal herbs Paper Telugu News Plants that improve immunity and health Skin and beauty care with natural herbs Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Top medicinal plants and their uses

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.