📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Sweets :ఒక వారం పాటు స్వీట్లకు దూరంగా ఉంటే ఎన్నో మార్పులు

Author Icon By Sudha
Updated: June 19, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వీట్లు తినే అలవాటు అనేది తాత్కాలిక ఆనందాన్ని(Temporary happiness)ఇచ్చినా, దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఆరోగ్యానికి హానికరం (Harmful to health). చాలా మందికి ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత స్వీట్స్(Sweets)తినాలని ఉండే ఆకాంక్ష, శారీరకంగా కాదు, మానసికంగా అభివృద్ధి అయిన అలవాటు మాత్రమే.

Sweets :ఒక వారం పాటు స్వీట్లకు దూరంగా ఉంటే ఎన్నో మార్పులు


మొదటికే మోసం
చాలా మందికి స్వీట్లు తినడమంటే మహాఇష్టం. పగలైనా, రాత్రి అయినా తేడా లేకుండా తెగ లాగించేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో దీనిని కేవలం ఇష్టం అనడం సరికాదు. ఎందుకంటే ఈ అలవాటు ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా కొంత మందికి రాత్రి భోజనం తర్వాత కూడా కొంచెం స్వీట్ తినడం ఇష్టం. ఎందుకంటే భోజనం తర్వాత కూడా వీరికి ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఫ్రిజ్‌లో ఎప్పుడూ స్వీట్లు నిల్వ ఉండటం వల్ల.. క్షణం కూడా ఆలోచించకుండా వాటిని లాగించేస్తుంటారు. అయితే, ఏదైనా ఎక్కువగా ఉంటే శరీరానికి అది అంత మంచిది కాదు. కొన్నిసార్లు ఈ విషయం తెలిసి కూడా దానిని నియంత్రించడం కష్టం అవుతుంది. టీ, కాఫీలో చక్కెర వేసుకోవడం సాధారణం. ఇతర స్వీట్లు ఇలా వేళాపాళాలేకుండా తినేస్తే మొదటికే మోసం వస్తుంది. అయితే స్వీట్లు మీకెంత ఇష్టం ఉన్నప్పటికీ ఒక వారం పాటు వీటికి దూరంగా ఉంటే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.
ధూమపానం చేసినంత హానికరం
అవసరానికి మించి స్వీట్లు తినడం ధూమపానం చేసినంత హానికరం. అలాగే ఎక్కువ కొవ్వు తినడంతో సమానం. ఇది బరువు పెరగడం నుంచి మధుమేహం, గుండె జబ్బుల వరకు సమస్యలకు దారితీస్తుంది. ఒక వారం పాటు చక్కెర తినకుండా ఉండగలిగితే, శరీరంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్నీ కావు. బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సీనియర్ వైద్యుడు డాక్టర్ అరవింద్ అగర్వాల్ ఏం చెబుతున్నారంటే.. ఎవరైనా ఒక వారం పాటు ‘షుగర్ లేని’ ఆహారాన్ని అనుసరిస్తే, శరీరంలో వివిధ సానుకూల మార్పులు కనిపిస్తాయి. ప్రారంభంలో కొంత అలసట, మానసిక స్థితిలో మార్పులు, తలనొప్పి ఉండవచ్చు. ఎందుకంటే శరీరం తీపికి అలవాటు పడి, అకస్మాత్తుగా ఆపివేసినట్లయితే ఇలా తాత్కాలిక సమస్యలను కలిగిస్తుంది. ఈ తీపిని తగ్గించిన తర్వాత, బరువు పెరగకుండా నిరోధించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి అనేక సానుకూల మార్పులు మీరు గమనిస్తారు.
10 శాతానికి మించకూడదు
‘షుగర్ లేని’ ఆహారం కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, గుండెల్లో మంట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది నిపుణులు చెబుతున్నారు. చర్మం క్లియర్‌గా, ఆరోగ్యంగా మారుతుంది. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. అమెరికన్ డైటరీ గైడ్‌లైన్స్ 2020-2025 ప్రకారం.. ఒక రోజులో మొత్తం కేలరీలలో 10 శాతానికి మించి చక్కెర ఉండకూడదు. బదులుగా, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, చేపలు, గుడ్లు మొదలైన వాటిని ఆహారంలో చేర్చవచ్చు. ఫలితంగా శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

Read Also:American dates: అమెరికన్ ఖర్జూరాలతో అనేక

#BeatSugarAddiction #DiabetesPrevention #HealthyHabits #MindfulEating #NightSnacking #SugarCravings Breaking News in Telugu for a week. Google news Google News in Telugu if you avoid sweets Latest News in Telugu Many changes can occur Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.