📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Coriander Seeds Water : ధ‌నియాల‌ కాషాయంతో ఎన్నో లాభాలు..

Author Icon By Sudha
Updated: June 17, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధనియాలు (Coriander Seeds) మనం సాధారణంగా వంటకాల్లో ఉపయోగించే దినుసులే అయినప్పటికీ, ఆయుర్వేదం(Ayurveda) లో వీటి ఉపయోగం ఎంతో విశిష్టమైనది. వీటిలో ఎన్నో ఔషధ (medicine)గుణాలున్నాయి. ఆయుర్వేదానికి అనుగుణంగా ధనియాలను దినచర్యలో భాగంగా వాడితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు పొందవచ్చు.

Coriander Seeds Water : ధ‌నియాల‌ కాషాయంతో ఎన్నో లాభాలు..


ఔష‌ధ గుణాలు
ధ‌నియాల‌ను మ‌నం వంటి ఇంటి మ‌సాలా దినుసులుగా ఎప్ప‌టినుంచో ఉప‌యోగిస్తున్నాం. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఈ దినుసులు అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలోనూ ధ‌నియాల‌ను ఉప‌యోగిస్తారు. అలాగే మసాలా వంట‌కాల్లోనూ వీటిని వాడుతారు. అయితే కేవ‌లం రుచి, వాస‌న‌ను అందిండ‌మే కాదు, మ‌న‌కు ఇవి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌ల‌గ‌జేస్తాయి. ధ‌నియాల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ధ‌నియాల‌తో త‌యారు చేసే నీళ్ల‌ను తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని వారు చెబుతున్నారు. ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి.
రక్తపోటు నియంత్రణ
ధ‌నియాల నీళ్ల‌ను తాగుతుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ సైతం త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ నీళ్లు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. శ‌రీరం ఇన్సులిన్‌ను బాగా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది. వీటిల్లో క్వ‌ర్సెటిన్‌, టెర్పినైన్‌, టోకోఫెరాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి. సీజ‌నల్ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సుర‌క్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు.
చర్మ సమస్యలకు ఉపశమనం
బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారు, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు కూడా ధ‌నియాల నీళ్లు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే శ‌రీరంలోని వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. మోకాళ్లు, కీళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా మారుతారు. నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి. ధ‌నియాల నీళ్ల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చు. లేదా భోజనం చేయ‌డానికి 45 నిమిషాల ముందు తాగాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. ధ‌నియాల‌ను రాత్రి పూట నీటిలో నాన‌బెడితే మ‌రుస‌టి రోజు మొత్తం ఆ నీళ్ల‌ను కొద్ది కొద్దిగా కూడా తాగుతూ ఉండ‌వ‌చ్చు.
ఇక ధ‌నియాల నీళ్ల‌ను కేవలం ధ‌నియాల‌ను నాన‌బెట్టి మాత్ర‌మే కాదు, ధ‌నియాల‌ను నీటిలో వేసి మ‌రిగించి కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇలా ఏ ర‌కంగా అయినా స‌రే ధ‌నియాల నీళ్ల‌ను త‌యారు చేసి తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ధ‌నియాలు అనేక వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని అంటున్నారు. అల‌ర్జీలు ఉన్న‌వారు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.

Read Also:Chandra Namaskar: రోజు చంద్ర నమస్కారం చేస్తే పలు లాభాలు

#AyurvedaHealing #CorianderBenefits #CorianderWater #DhaniyaPower #DigestiveHealth #HerbalMedicine #NaturalRemedies Breaking News in Telugu coriander seeds.. Google news Google News in Telugu Latest News in Telugu Many benefits of Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.