మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్ జిల్లాలో కలుషిత నీటిని వినియోగించడం వల్ల జరిగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్‌పుర ప్రాంతంలో ప్రస్తుతం 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ప్రభావం ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. మోవ్‌లో సుమారు 30 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరందరికీ వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
Read Also:Indian Navy: భారత నౌకాదళం స్పెషల్ వీడియో రిలీజ్
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం(Madhya Pradesh) ఇప్పటికే 21 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు తెలిపింది. మిగతా కుటుంబాలకు కూడా త్వరలో సహాయం అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇండోర్ జిల్లా కలెక్టర్ శివమ్ వర్మ స్పందిస్తూ, బాధితులందరికీ అవసరమైన వైద్య సదుపాయాలు నిరంతరంగా అందిస్తున్నామని తెలిపారు. పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: