📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Kidney Stones : కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్రతలు పాటించండి..

Author Icon By Sudha
Updated: August 15, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడు కిడ్నీ రాళ్ల (Kidney Stones) సమస్య పెద్ద వయసులో వారికే కాకుండా యుక్త వయస్సులో ఉన్న వారికీ ఎక్కువగా కనిపిస్తోంది. పాతకాలంలో ఇది ఎక్కువగా వృద్ధుల సమస్యగా పరిగణించబడినప్పటికీ, ప్రస్తుతం 20-40 సంవత్సరాల మధ్య ఉన్న వారిలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నీటి వినియోగం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మ‌ద్యం అధికంగా సేవించ‌డం, పొగ తాగ‌డం, మాంసాహారాల‌ను అధికంగా తిన‌డం, నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం, కూల్ డ్రింక్‌ల‌ను అధికంగా సేవించ‌డం వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల (For many reasons)చాలా మందికి కిడ్నీ స్టోన్లు వ‌స్తుంటాయి. అయితే కిడ్నీ స్టోన్లు (KidneyStones) వ‌చ్చిన‌ప్పుడు వాటిని త‌క్కువ సైజులోనే ఉన్న‌ప్పుడు గుర్తిస్తే వాటికి శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం ఉండ‌దు. డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడితే స్టోన్లు వాటంత‌ట అవే క‌రిగిపోతాయి. దీంతోపాటు నొప్పి కూడా త‌గ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. అలాగే ఆహారం విష‌యంలోనూ ప‌లు మార్పులు చేసుకుంటే ఈ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Kidney Stones : కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్రతలు పాటించండి..

సిట్రేట్ ఉన్న పండ్లు తినాలి

కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య స‌హ‌జంగా నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల వ‌స్తుంది. నీళ్ల‌ను త‌గినంత మోతాదులో తాగ‌క‌పోతే కిడ్నీల్లో (Kidney Stones)వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అవి దీర్ఘ‌కాలంలో రాళ్లుగా మారుతాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే నీళ్ల‌ను తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో కిడ్నీల్లో ఉండే వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పోతాయి. స్టోన్స్ ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. రోజుకు క‌నీసం 2 నుంచి 3 లీట‌ర్ల నీళ్ల‌ను తాగితే అస‌లు కిడ్నీ స్టోన్లు రావ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక నీళ్ల‌ను త‌గినంత మోతాదులో తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. అలాగే నిమ్మ జాతికి చెందిన పండ్ల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పండ్ల‌లో సిట్రేట్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించేందుకు స‌హాయం చేస్తుంది. కిడ్నీల్లో స్టోన్ల‌కు కార‌ణం అయ్యే కాల్షియం, ఆగ్జ‌లేట్స్ వంటి వాటిని మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తుంది. నిమ్మ‌ర‌సం, నారింజ‌, ద్రాక్ష‌, పైనాపిల్ వంటి పండ్ల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జ‌రుగుతుంది. కిడ్నీ స్టోన్ల‌ను త్వ‌ర‌గా వ‌దిలించుకోవ‌చ్చు.

క్యాల్షియం, ఆగ్జ‌లేట్స్ తక్కువుగా ఉండాలి

క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాల‌ను తిన‌డం మానుకోవాలి. ఆగ్జ‌లేట్స్ అధికంగా ఉండే ఆహారాల‌ను కూడా త‌క్కువ‌గా తినాలి. ఈ రెండు ర‌కాల ఆహారాల‌ను క‌లిపి తిన‌కూడ‌దు. ఇవి స్టోన్లు వ‌చ్చేందుకు కార‌ణం అవుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు పాల‌కూర‌, ట‌మాటాల‌ను క‌లిపి తింటే వీటిల్లో ఉండే క్యాల్షియం, ఆగ్జ‌లేట్స్ కార‌ణంగా ఇవి కిడ్నీల్లో స్టోన్లు ఏర్ప‌డేందుకు కార‌ణం అవుతాయి. క‌నుక ఇలాంటి ఫుడ్ కాంబినేష‌న్ల‌ను మానేయాలి. వెన్న త‌క్కువ‌గా ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటివి తింటే వాటిల్లో ఉండే విట‌మిన్ డి శరీరంలో అధికంగా ఉండే క్యాల్షియంను శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముక‌లు నిర్మాణ‌మ‌వుతాయి. ఎముక‌లు బ‌లంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ల స‌మస్య ఉండ‌దు. ఇక కొంద‌రు క్యాల్షియం ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. కానీ ఇది డోసు మించితే స్టోన్స్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంటుంది. క‌నుక డాక్ట‌ర్ చెబితే త‌ప్ప ఈ ట్యాబ్లెట్ల‌ను వాడ‌కూడదు.

Kidney Stones : కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్రతలు పాటించండి..

శీత‌ల పానీయాల‌తో నెగెటివ్ ప్ర‌భావం

మాంసాహారం అధికంగా తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోయి అది కూడా కిడ్నీ స్టోన్స్‌ను క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక మాంసాహారాన్ని అధికంగా తిన‌డం మానుకోవాలి. అందుకు బ‌దులుగా ప‌ప్పు దినుసులు, శ‌న‌గ‌లు, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీల‌ను తీసుకోవాలి. ఇవి కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌కుండా చూస్తాయి. ప్రోటీన్ల‌ను సైతం అందిస్తాయి. అలాగే టీ, కాఫీల‌ను అధికంగా తాగ‌డం వ‌ల్ల కూడా స్టోన్స్ వ‌స్తాయి. క‌నుక రోజుకు 2 లేదా 3 క‌ప్పుల‌కు మించి టీ, కాఫీ తాగ‌కుండా చూసుకోవాలి. ఫాస్డ్ ఫుడ్స్‌, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, స్నాక్స్‌, శీత‌ల పానీయాల‌ను తీసుకోవ‌డం మానుకోవాలి. ఇవ‌న్నీ కిడ్నీల‌పై నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపిస్తాయి. స్టోన్స్ ఏర్ప‌డేలా చేస్తాయి. ఇలా ఆహారాల విష‌యంలో మార్పులు చేసుకుంటే కిడ్నీ స్టోన్స్ ను సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. భ‌విష్య‌త్తులోనూ మ‌ళ్లీ ఇవి ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

మూత్రపిండాల్లో రాళ్లకు ప్రధాన కారణం ఏమిటి?

కిడ్నీ రాళ్లను మూత్రపిండ కాలిక్యులి లేదా నెఫ్రోలిథియాసిస్ అని కూడా పిలుస్తారు, ఇవి మూత్రపిండాలలో ఖనిజాలు మరియు లవణాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి, ఇవి గట్టి నిక్షేపాలను ఏర్పరుస్తాయి. ఈ నిక్షేపాలు లేదా రాళ్లు ఇసుక రేణువు నుండి గోల్ఫ్ బాల్ వరకు పరిమాణంలో ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లకు ఖచ్చితమైన కారణం మారవచ్చు, కానీ అవి తరచుగా ఆహారం, జన్యుశాస్త్రం మరియు వైద్య పరిస్థితులతో సహా అంశాల కలయిక నుండి ఉత్పన్నమవుతాయి.

కిడ్నీలో రాళ్లు ఏ రంగులో ఉంటాయి?

కిడ్నీలో రాళ్ళు సాధారణంగా మిరియాల గింజల పరిమాణం కంటే కొంచెం చిన్నవి లేదా పెద్దవిగా ఉంటాయి మరియు రంగులో మారుతూ ఉంటాయి. నలుపు, గోధుమ, పసుపు, బూడిద రంగు, మరియు అరుదుగా నారింజ లేదా గులాబీ రంగు . మీరు ఒక పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని మీరు అనుకుంటే, మరిన్ని ఉంటే మీ ప్రాథమిక సంరక్షణ ప్రదాత మరియు/లేదా యూరాలజిస్ట్‌కు తెలియజేయాలి.

అరుదైన కిడ్నీ స్టోన్ ఏది?

సిస్టీన్ రాళ్ళు అనేవి అత్యంత అరుదైన మూత్రపిండాల రాళ్ళు, మరియు అవి మృదువుగా ఉన్నప్పటికీ, అవి మిగతా వాటి కంటే చాలా పెద్దవిగా కూడా ఉంటాయి. సిస్టీన్ అనేది ఒక రకమైన అమైనో ఆమ్లం, ఇది ప్రోటీన్ యొక్క నిర్మాణ పదార్థం. మీరు అమైనో ఆమ్లం లేదా సిస్టీన్ సప్లిమెంట్ తీసుకుంటే మీకు సిస్టీన్ రాళ్ళు ఏర్పడవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/health-benefits-of-eating-raisins/more/cheli/529883/

Breaking News health tips Kidney Stone Causes Kidney Stone Symptoms kidney stones latest news Telugu Health News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.