📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Fasting :వారానికి ఒక రోజు ఉప‌వాసం ఉండటం మంచిదేనా?

Author Icon By Sudha
Updated: June 20, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సంస్కృతిలో ఉపవాసం (Fasting) అనే సంప్రదాయం అనేక శతాబ్దాలుగా పాటించబడుతోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక విధిగా కాక, శారీరక, మానసిక ఆరోగ్యాని (For mental health)కి కూడా ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు మరియు పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధ్యాత్మిక ప‌రంగా ఉప‌వాసం ఉంటారు కానీ ఇందులో సైన్స్ (Science)కూడా దాగి ఉంది. వారంలోని ఏదో ఒక రోజు ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయ‌ని సైన్స్ కూడా చెబుతోంది.

Fasting :వారానికి ఒక రోజు ఉప‌వాసం ఉండటం మంచిదేనా?

అనేక ప్ర‌యోజ‌నాలు
వారంలోని ఏదో ఒక రోజు ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయ‌ని సైన్స్ కూడా చెబుతోంది. ఉప‌వాసం వ‌ల్ల శ‌రీరం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వుతుంది. వారంలోని ఏదో ఒక రోజును ఎంచుకుని ఉప‌వాసం ఉంటే అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల వారం మొత్తం మీద తీసుకునే క్యాల‌రీల సంఖ్యపై ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో శ‌రీరం క్యాల‌రీల కోసం కొవ్వును క‌రిగిస్తుంది. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. అలాగే వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉంటే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి.
నియంత్ర‌ణ‌లో హార్మోన్లు
సాధార‌ణంగా మ‌నం రాత్రి తిన్న త‌రువాత ఉద‌యం వ‌ర‌కు మ‌న శ‌రీరం ఖాళీగా మారుతుంది. దీంతో శ‌క్తి కోసం చూస్తుంది. అయితే అలాంటి స‌మ‌యంలో ఉప‌వాసం ఉంటే శ‌రీరం శ‌క్తి కోసం కొవ్వును క‌రిగిస్తుంది. అలా క‌నీసం మ‌రో 12 గంట‌ల పాటు ఉన్నా చాలు, కొవ్వు క‌రిగే ప్ర‌క్రియ పెరుగుతుంది. దీంతో శ‌రీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం క‌రిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర‌, తొడ‌ల ద‌గ్గ‌ర ఉండే కొవ్వు క‌రుగుతుంది. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. క‌నుక వారంలో ఒక రోజు ఉప‌వాసం చేసే విధంగా నియ‌మాన్ని పెట్టుకుని క‌చ్చితంగా దాన్ని పాటించండి. ఎంతో ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. వారంలో ఒక రోజు ఉప‌వాసం చేస్తే ఆక‌లి హార్మోన్లు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ఆహారం ఎంత తినాలి అనే విష‌యంపై నియంత్ర‌ణ సాధిస్తారు. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది.
ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది
వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల క్లోమ‌గంథ్రికి విశ్రాంతి ల‌భిస్తుంది. దీంతోపాటు శ‌రీరం ఇన్సులిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఫాస్టింగ్ చేసే స‌మ‌యంలో మందుల‌ను వాడ‌కూడ‌దు. లేదంటే షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రీ అధికంగా ప‌డిపోతే ప్రాణాంత‌కం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. ఈ విష‌యంలో డాక్ట‌ర్ స‌ల‌హా పాటించ‌డం ఉత్త‌మం. వారంలో ఒక రోజు ఉప‌వాసం పాటించ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.
చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది
వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉంటే శ‌రీరం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. పాత క‌ణాల స్థానంలో కొత్త క‌ణాల‌ను నిర్మిస్తుంది. దీంతో అన్ని అవ‌య‌వాలు మ‌ళ్లీ పున‌రుత్తేజం చెంది యాక్టివ్‌గా మారుతాయి. ముఖ్యంగా చ‌ర్మం మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతుంది. కొత్త క‌ణాలు వ‌చ్చి కాంతివంతంగా క‌నిపిస్తారు. య‌వ్వ‌నంగా మారిపోతారు. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరంలో ఉండే వాపులు త‌గ్గిపోతాయి. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. చురుగ్గా ఉంటారు. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. నీర‌సం, అల‌స‌ట ఉండ‌వు. ఇలా ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.
వీరు ఉపవాసాలు ఉండకూడదు
గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు లేదా పాలిచ్చే త‌ల్లులు ఉప‌వాసం ఉండ‌డం మంచిది కాదు. టీనేజ్ వ‌య‌స్సులో ఉన్న‌వారితోపాటు అంత క‌న్నా చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు, పిల్ల‌లు కూడా ఉప‌వాసం చేయ‌కూడ‌దు. టైప్ 2 డ‌యాబెటిస్ ఉంటే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఉప‌వాసం చేయ‌వ‌చ్చు. టైప్ 1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయ‌రాదు. కిడ్నీ, లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారు, గుండె జ‌బ్బులు ఉన్న‌వారు, బీపీ మందుల‌ను వాడుతున్న‌వారు, పోష‌కాహార లోపం ఉన్న‌వారు, బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌వారు, గౌట్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, వ‌య‌స్సు మీద ప‌డిన వారు ఉప‌వాసం చేయ‌కూడ‌దు. ఉప‌వాసం ఉన్న స‌మ‌యంలో నీళ్ల‌ను అధికంగా తాగాలి. ఆక‌లికి త‌ట్టుకోలేక‌పోతే తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపిన నీళ్ల‌ను తాగుతుండాలి. లేదా కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తినాలి. ఇలా ఉప‌వాసం చేస్తే చ‌క్కని ఫ‌లితం ఉంటుంది.

Read Also:American dates: అమెరికన్ ఖర్జూరాలతో అనేక

#FastingBenefits #HealthThroughFasting #IndianTradition #IntermittentFasting #MindBodyBalance #SpiritualScience Breaking News in Telugu fast one day a week? Google news Google News in Telugu Is it good to Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.