📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త NAARMలో ఉద్యోగాలు.. త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం నేటి బంగారం ధర ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల ‘అఖండ 2’ మూవీ రివ్యూ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ NAARMలో ఉద్యోగాలు.. గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త NAARMలో ఉద్యోగాలు.. త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం నేటి బంగారం ధర ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల ‘అఖండ 2’ మూవీ రివ్యూ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ NAARMలో ఉద్యోగాలు.. గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2

Latest Telugu News : Honey : వాడుతున్న తేనె నాణ్యమైనదా? లేదా క‌ల్తీదా? తెలుసుకుందాం ..

Author Icon By Sudha
Updated: December 12, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, పోష‌కాల‌కు తేనె నిలయం. ప‌లు అనారోగ్యాల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డంలో తేనె (Honey) కు అధిక ప్రాధ‌న్య‌త ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను ప‌లు ఔష‌ధాల‌తోపాటుగా ఇస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో తేనె వాడ‌కం ఎక్కువ‌వ‌డంతో వ్యాపారులు దాన్ని కూడా క‌ల్తీ చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు స్వచ్ఛ‌మైన‌ తేనె (Honey) ఏదో న‌కిలీ తేనె ఏదో గుర్తించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. అయితే ప‌లు సూచ‌న‌లు పాటిస్తే న‌కిలీ తేనెను ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు.

Read Also: http://Moringa Benefits: మునగ ఆకుల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Honey

న‌కిలీ తేనె నీటిలో క‌రుగుతుంది

మీరు కొన్న తేనె అస‌లుదో, న‌కిలీదో గుర్తించాలంటే దాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. న‌కిలీ తేనె అయితే వెంట‌నే నీటిలో క‌రుగుతుంది. అస‌లు తేనె గ్లాస్ అడుగు భాగంలోకి చేరుతుంది. అంతే త‌ప్ప నీటిలో అంత త్వ‌ర‌గా క‌ర‌గ‌దు. అలాగే ఒక కాట‌న్ బాల్‌ను తీసుకుని దాన్ని తేనెలో ముంచాలి. అనంత‌రం దానికి అగ్గిపుల్ల‌తో నిప్పు పెట్టాలి. అస‌లు తేనె అయితే కాట‌న్ బాల్ మండుతుంది. న‌కిలీ తేనె అయితే కాటన్ బాల్ మండ‌దు. అదేవిధంగా ఒక‌ తేనె చుక్క‌ను గోరుపై వేసుకోవాలి. ఆ చుక్క గోరుపై అటు ఇటు క‌దిలితే అది న‌కిలీ తేనె అన్న‌మాట‌. అదే ఆ చుక్క క‌ద‌ల‌కుండా స్థిరంగా ఉంటే ఆ తేనెను అస‌లైందిగా భావించాలి.

చుట్టూ విస్తరిస్తే నకిలీ

ఇక సాధారణంగా మొలాసిస్, మొక్కజొన్న పిండి తదితర పదార్థాలను ఉపయోగించి నకిలీ తేనెను తయారు చేస్తారు. ఈ క్ర‌మంలో నకిలీ తేనెను గుర్తించడం చాలా సులభమే అని చెప్ప‌వ‌చ్చు. కొద్దిగా తేనె తీసుకుని దానికి 2, 3 చుక్కల వెనిగర్ ఎస్సెన్స్ కలపాలి. అనంతరం వాటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా వచ్చిన మిశ్రమం ఎక్కువగా నురగను విడుదల చేస్తుంటే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి. ఎందుకంటే నకిలీ తేనె కోసం ఉపయోగించే పదార్థాల్లో చక్కెర కూడా ఉంటుంది. ఇది వెనిగర్‌తో కలిసినప్పుడు నురగలాంటి ద్రవాన్ని ఇస్తుంది. అసలైన తేనె ఇలా నురగను ఇవ్వదు. అలాగే కొద్దిగా తేనెను తీసుకుని బొటనవేలిపై వేయాలి. అనంతరం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తేనె చుక్క‌ వేలిపై చుట్టూ విస్తరిస్తే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి.

Honey

ఎన్ని రోజులు ఉన్నా పాడ‌వ‌దు

ఇక సాధార‌ణంగా స్వ‌చ్ఛ‌మైన తేనె అయితే అస‌లు ఎక్స్‌పైరీ ఉండ‌దు. కానీ మ‌న‌కు మార్కెట్‌లో ల‌భించే తేనెలో కొంద‌రు ర‌సాయ‌నాలు క‌లుపుతారు. క‌నుక మ‌నం కొనే తేనెకు ఎక్స్‌పైరీ ఉంటుంది. కానీ స‌హ‌జ‌సిద్ధంగా కొన్న తేనె అయితే ఎన్ని రోజులు ఉన్నా పాడ‌వ‌దు. రోజులు గ‌డిచే కొద్దీ ఇంకా రుచి పెరుగుతుంది. మార్కెట్‌లో మీరు తేనె కొంటే వీలైనంత వ‌ర‌కు బ్రాండెడ్ కంపెనీల‌కు చెందిన తేనె అయితే మంచిది. అది క‌ల్తీ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ఇలా ప‌లు సూచ‌న‌లు పాటిస్తే న‌కిలీ తేనెను గుర్తించ‌డంతోపాటు దాన్ని కొన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

adulterated honey Breaking News Food Quality home tests honey purity latest news pure honey test Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.