📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

High BP : అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు ఉప్పు త‌గ్గిస్తే చాల‌దు.. దీన్ని ఎక్కువగా తీసుకోవాలి..

Author Icon By Sudha
Updated: January 23, 2026 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న‌శైలే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. రక్త‌పోటు అన‌గానే ముందుగా అంద‌రూ ఉప్పును త‌క్కువ‌గా తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. ర‌క్త‌పోటుతో(High BP) బాధ‌ప‌డే వారు రోజూ 6 గ్రాముల కంటే త‌క్కువ ఉప్పును తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే తాజా ప‌రిశోధ‌న‌లు ఉప్పును త‌క్కువ‌గా తీసుకున్నంత మాత్రాన ర‌క్త‌పోటు (High BP)త‌గ్గ‌ద‌ని పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్లే ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంద‌ని చెబుతున్నాయి. కెన‌డాలోని వాట‌ర్‌లూ విశ్వవిద్యాల‌య ప‌రిశోధ‌కులు ఉప్పును త‌గ్గించ‌డంపై మాత్ర‌మే దృష్టి పెట్ట‌డం కంటే పొటాషియం, సోడియం నిష్ప‌త్తిని పెంచ‌డం ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌కు మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ఉంటుంద‌ని సూచిస్తున్నారు. సాధార‌ణంగా మ‌న‌కు అధిక ర‌క్త‌పోటు ఉన్న‌ప్పుడు త‌క్కువ ఉప్పును తీసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తారు. అయితే ఆహారంలో భాగంగా అర‌టిపండు, బ్రోక‌లీ వంటి పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకున్న‌ప్ప‌డు ఉప్పును త‌గ్గించిన‌ప్ప‌టి కంటే కూడా ర‌క్త‌పోటు స్థాయిలు ఎక్కువ త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Read Also: http://Helth Tips: ఉసిరికాయ తినడం మంచిదేనా? నిపుణుల హెచ్చరికలు

High BP


ఆహారంలో అధిక ఉప్పు శ‌రీరం నీటిని నిలుపుకునేలా చేస్తుంది. ఇది ర‌క్తనాళాల‌పై ఒత్తిడిని పెంచుతుంది. చివ‌రికి మూత్ర‌పిండాల‌పై ఒత్తిడిని పెంచుతుంది. ఉప్పును త‌గ్గించ‌డం ప్ర‌యోజ‌క‌రంగా ఉన్న‌ప్ప‌టికీ, పొటాషియం శ‌రీరం నుండి అద‌నంగా ఉన్న సోడియంను బ‌య‌ట‌కు పంప‌డానికి, రక్త‌నాళాల గోడ‌ల‌ను సడ‌లించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. పొటాషియం, సోడియం రెండూ కూడా ఎల‌క్ట్రోలైట్లు. న‌రాల సిగ్న‌లింగ్, కండ‌రాల సంకోచాలు, ద్ర‌వ స‌మ‌తుల్య‌త వంటి శారీర‌క విధుల‌ను ఇవి నిర్వ‌ర్తిస్తాయి. ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎల‌క్ట్రోలైట్ల స‌మ‌తుల్య‌త పునరుద్దించ‌డంతో పాటు ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది. మారిన ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా ప్ర‌జ‌లు సోడియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకుంటున్నారు. దీంతో ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారి సంఖ్య పెరుగుతోంది. అధిక ర‌క్త‌పోటు కార‌ణంగా గుండె జ‌బ్బులు, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు ఉప్పును త‌క్కువ‌గా తీసుకోవ‌డంతో పాటు పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవడానికి ప్ర‌య‌త్నించాలి. భోజ‌నంలో అర‌టిపండు, చిల‌గ‌డ‌దుంప‌, కాయ‌ధాన్యాలు, అవ‌కాడో వంటి వాటిని తీసుకోవ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. ర‌క్త‌పోటుతో బాధప‌డే వారే కాకుండా ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు కూడా పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో రక్త‌పోటు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper :epapervaartha.com

Read Also:

Breaking News heart health high blood pressure hypertension latest news potassium intake reduce salt Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.