శరీరానికి సరిపడా నీరు అందకపోతే డీహైడ్రేషన్(Healthy Lifestyle) ఏర్పడి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి లోపం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక, తలనొప్పి, అలసట, భారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఇది ఊబకాయం పెరగడానికి కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ నీరు తాగడం వల్ల మూత్రం గాఢంగా మారి, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువవుతుంది. దీని కారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే శరీరంలో నీటి లోపం రక్త ప్రసరణపై ప్రభావం చూపడంతో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి బలహీనత ఏర్పడే అవకాశముందని అంటున్నారు.
డీహైడ్రేషన్ ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. చర్మం(Healthy Lifestyle) పొడిబారడం, ముడతలు పడటం, మచ్చలు, మొటిమలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల రోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని వారు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: