మన శరీరానికి అవసరమైన విటమిన్లు తగ్గిపోతే పలు అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ B12 (vitamin b12) లోపం కాలేయ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. జీర్ణ సంబంధ సమస్యలు, కొన్ని మందులు లేదా వయస్సు కారణంగా B12 శోషణ తగ్గినప్పుడు సప్లిమెంట్లు లేదా ఇంజెక్షన్లు వైద్యుల సూచన మేరకు తీసుకోవడం చాలా ఉపయోగకరం. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతుండటానికి అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అధిక కొవ్వు ఆహారం, మద్యం సేవించడం ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలో NAFLD (నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్) కి విటమిన్ లోపం కూడా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్‌గా గుర్తించబడింది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే పరిణామాలను అర్థం చేసుకోవడంలో B12 ఎంతో కీలక పాత్రలో ఉంటుంది.
Read also: Health: బరువు తగ్గించాలంటే అన్నం తినకూడదా?
If these vitamins are deficient, the liver will be damaged
విటమిన్ B12 ప్రాధాన్యం – హోమోసిస్టీన్ ప్రభావం
విటమిన్ B12 శరీరంలో కొవ్వు, ప్రోటీన్ జీవక్రియకు అవసరమైన ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలు పెరుగుతాయి. ఫోలేట్‌తో కలిసి B12 ఈ హోమోసిస్టీన్‌ను మెథియోనిన్‌గా మార్చుతుంది. B12 తగ్గినప్పుడు ఈ ప్రక్రియ సరిగా జరగదు. హోమోసిస్టీన్ ఎక్కువైతే కాలేయ కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు పెరిగి NAFLD తీవ్రత పెరుగుతుంది. అధ్యయనాలు చెబుతున్నాయి.ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో B12 స్థాయిలు ఆరోగ్యవంతుల కంటే తక్కువగా ఉంటాయి. సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్‌లు మెరుగుపడినట్లు కొన్ని నివేదికలు చూపిస్తున్నాయి.
విటమిన్ E – కాలేయానికి యాంటీఆక్సిడెంట్ రక్షణ
విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. NAFLD ఉన్నవారిలో ఏర్పడే వాపు, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. NASH ఉన్న కొంతమంది రోగులలో విటమిన్ E సప్లిమెంట్లు ఉపయోగకరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఈ విటమిన్‌ను తప్పనిసరిగా వైద్యుల సూచనతో మాత్రమే తీసుకోవాలి.
విటమిన్ D – ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి రిలేషన్
విటమిన్ D లోపం కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాపును నియంత్రించడంలో విటమిన్ D ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని లోపం ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ త్వరగా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది.
నివారణ జీవనశైలి మార్పులు తప్పనిసరి
• B12 కోసం మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్ వంటి ఆహారాలు తీసుకోవాలి
• శాకాహారులు B12 ఫోర్టిఫైడ్ ఆహారాలు లేదా సప్లిమెంట్లు తీసుకోవాలి
• బరువు 5–10% తగ్గితే NAFLD తగ్గే అవకాశం ఉంది
• రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి
• అధిక చక్కెర, ఫ్రక్టోజ్ ఉన్న పానీయాలు, తెల్ల బియ్యం, బంగాళదుంపల వినియోగం తగ్గించాలి
• గింజలు, ఆకు కూరలు, ఫ్యాటీ ఫిష్, పసుపు, గ్రీన్ టీ వంటి యాంటీఆక్సిడెంట్ ఆహారాలు చేర్చుకోవాలి
• క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, కాలేయ ఎంజైమ్‌లు, విటమిన్ స్థాయిలను తనిఖీ చేయాలి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: