📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Latest Telugu News : Garam Masala : గ‌రం మ‌సాలా పొడితో ఇన్ని లాభాలా!

Author Icon By Sudha
Updated: December 8, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కొన్ని ర‌కాల ప్ర‌త్యేక‌మైన వంట‌కాల‌కు మ‌సాలా అవ‌స‌రం అవుతుంది. మ‌సాలా వేయ‌క‌పోతే ఆయా వంట‌కాల‌కు రుచి రాదు. వంట‌కాల‌కు రుచిని అందించ‌డంలో మ‌సాలాల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ క్ర‌మంలోనే వంట‌ల‌ను బ‌ట్టి కొంద‌రు భిన్న‌మైన మ‌సాలాల‌ను ఉప‌యోగిస్తారు. అయితే అన్నింటిల్లోకెల్లా గ‌రం మ‌సాలా(Garam Masala)ను అధిక శాతం మంది ఉప‌యోగిస్తుంటారు. ఇది కేవ‌లం వెజ్ వంట‌కాల‌కు మాత్ర‌మే కాకుండా నాన్ వెజ్ వంట‌కాల‌కు కూడా కామ‌న్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అద్భుత‌మైన రుచి, సువాస‌న‌ను అందిస్తుంది. గ‌రం మ‌సాలా(Garam Masala)ను వంటల్లో వేస్తే అప్పుడు వ‌చ్చే వాస‌న‌కే క‌డుపు నిండిపోయిన భావ‌న క‌లుగుతుంది. అయితే వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం గ‌రం మ‌సాలా పొడి మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తుంది. దీన్ని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల అనేక లాభాలు ఉంటాయి.

Read Also: HealthTips: మొటిమలు సూచించే శరీర సమస్యలు

Garam Masala

జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు

గ‌రం మ‌సాలా పొడిలో అనేక మ‌సాలా దినుసులు క‌లిసి ఉంటాయి. జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, న‌ల్ల మిరియాలు, బిర్యానీ ఆకులు, జాప‌త్రి, జాజికాయ వంటి మ‌సాలా దినుసుల‌తో గ‌రం మ‌సాలా పొడిని త‌యారు చేస్తారు. ఇవ‌న్నీ ఆయుర్వేద ప్ర‌కారం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి. క‌నుక గ‌రం మ‌సాలా పొడి కూడా మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే మ‌సాలా క‌నుక అప్పుడ‌ప్పుడు వాడాలి. త‌ర‌చూ వాడితే జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా క‌డుపులో మంట‌, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే దీన్ని మోతాదులో అప్పుడ‌ప్పుడు వాడితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గ‌రం మ‌సాలా పొడిని మ‌రీ అధికంగా వాడితే అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. కానీ దీన్ని త‌క్కువ మోతాదులో ఉప‌యోగిస్తే అదే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలోనే గ‌రం మ‌సాలా పొడి వ‌ల్ల అనేక జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, పొట్ట‌లోని అసౌక‌ర్యం తొల‌గిపోతాయి.

శ‌రీరానికి వేడిని

గ‌రం మ‌సాలా పొడిని వాడుతుంటే జీర్ణ ర‌సాలు స‌రిగ్గా ఉత్ప‌త్తి అవుతాయి. దీని వ‌ల్ల ఎంజైమ్‌ల ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీంతో మ‌నం తినే ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. అలాగే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సులభంగా శోషించుకుంటుంది. గ‌రం మ‌సాలా పొడిలో అనేక ర‌కాల మ‌సాలా దినుసులు ఉంటాయి క‌నుక దీన్ని వాడితే అనేక యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. దీని వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, వాపులు త‌గ్గుతాయి. దీంతో గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. గ‌రం మ‌సాలా పొడి థర్మోజెనెసిస్ అనే ప్ర‌క్రియ‌ను క‌ల‌గ‌జేస్తుంది. అంటే శ‌రీరానికి వేడిని అందిస్తుంద‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో ఈ పొడిని చ‌లికాలంలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటే శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు. చ‌లి నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

Garam Masala

డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో..

గ‌రం మ‌సాలా పొడి వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ఈ పొడి యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి మేలు జరుగుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. షుగ‌ర్ ఉన్న‌వారికి ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ పొడిలో అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఐర‌న్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్ వంటి మిన‌ర‌ల్స్‌ను పొంద‌వ‌చ్చు. ఇలా గ‌రంమసాలా పొడి మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తుంది. కానీ దీన్ని మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ayurveda Breaking News garam masala health benefits Indian spices latest news spice powder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.