हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Diabetes :మధుమేహం ఉన్నవారు ఏయే పండ్లు తినాలి?

Sudha
Diabetes :మధుమేహం ఉన్నవారు ఏయే పండ్లు తినాలి?

పండ్లు సహజంగా చక్కెర (ఫ్రక్టోజ్, గ్లూకోజ్) కలిగి ఉన్నప్పటికీ, వాటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొన్ని పండ్లు మధుమేహం (Diabetes)ఉన్నవారికి ఆరోగ్యకరంగా ఉండొచ్చు – కానీ ఎంచుకోవడంలో జాగ్రత్త అవసరం. పండ్లలో 80 శాతం నీరు, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, శరీరానికి కావాల్సిన పీచు పదార్థం, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెరను నెమ్మదిగా, తక్కువగా పెంచుతాయి. అందుకే పూర్తిగా సహజమైన పండ్లు తినడం మధుమేహ (Diabetes) రోగులకు కూడా సురక్షితం. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని వెంటనే పెంచదు. అది కాలేయంలో మారుతుంది. గ్లూకోజ్ రక్త చక్కెర(blood sugar)ను పెంచుతుంది.. కానీ పండ్లలోని పీచు పదార్థంతో కలిసి ఉండటం వల్ల అది ఆహార నాళాల్లో నెమ్మదిగా విడుదలై రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు సహజంగా ఉండే పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర క్రమంగా కొంత పెరిగి రెండున్నర గంటల్లో మళ్లీ మామూలుగా తగ్గిపోతుంది. ఈ కారణంగా ఖాళీ కడుపుతో పండ్లు తినడం డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం కాదు.

మధుమేహం ఉన్నవారు ఏయే పండ్లు తినాలి?
మధుమేహం ఉన్నవారు ఏయే పండ్లు తినాలి?

పీచు పదార్థంగల పండ్లు
పండ్లు మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా (గట్ ఫ్లోరా)ను నాశనం చేస్తాయని అనుకోవడం తప్పు. పండ్లలోని పీచు పదార్థాలు, పాలిఫినాల్స్, షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గట్ ఫ్లోరాకు హానికరమైనవి అధిక మోతాదులో మద్యం, ఎక్కువ యాంటీబయోటిక్స్, కీమోథెరపీ మాత్రలు మాత్రమే.\ పండ్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయని.. రక్త చక్కెరను వేగంగా పెంచవని చాలా మందికి సరిగా అర్థం కాదు. నిజానికి పండ్లు తక్కువ సమయంలోనే జీర్ణం అవుతాయి. వాటిలోని పీచు పదార్థం రక్తంలో చక్కెర పెరగడాన్ని అతి వేగంగా కాకుండా.. నియంత్రణలో ఉంచుతుంది. రోజుకు సుమారు 250 గ్రాముల సహజ పండ్లు తినడం మధుమేహం వంటి రోగాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పండ్లు తినడమే కాకుండా.. మధుమేహం(Diabetes) రావడానికి మన జీవనశైలిలోని కొన్ని అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లతో మధుమేహం నియంత్రణ
పండ్లలోని పీచు పదార్థం, విటమిన్లు, సహజ చక్కెరలు మధుమేహం నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో, శరీరానికి శక్తిని ఇవ్వడంలో, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ విధంగా పండ్లను సరైన సమయానికి, సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా మధుమేహ రోగులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

Read Also: hindi.vaartha.com

Read Also:Beetroot leafs: బీట్‌రూట్‌ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870