📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : Foot Massage : త‌ర‌చూ ఫుట్ మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

Author Icon By Sudha
Updated: November 5, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆయుర్వేదంలో బాడీ మ‌సాజ్‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయుర్వేదంలో ప‌లు ర‌కాల చికిత్సా ప‌ద్ధ‌తుల్లో భాగంగా బాడీ మ‌సాజ్ కూడా చేస్తారు. ఇందుకు గాను ప‌లు ర‌కాల నూనెల‌ను ప‌లు ఔష‌ధాల‌తో క‌లిపి ఉప‌యోగిస్తారు. త‌రువాత స్టీమ్ బాత్ లేదా స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా ఆయుర్వేదంలో కొన్ని ర‌కాల చికిత్స‌ల్లో ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తారు. దీని వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వారంలో క‌నీసం ఒక‌సారి అయినా స‌రే ఇలా బాడీ మ‌సాజ్ చేసుకుని స్నానం చేయాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. అందుక‌నే చాలా మంది సెల‌బ్రిటీలు కూడా ఇలా త‌ర‌చూ పాటిస్తుంటారు. అయితే బాడీ మ‌సాజ్ మాత్ర‌మే కాకుండా ఆయుర్వేదంలో ఫుట్ మ‌సాజ్.. (Foot Massage) అంటే పాదాల మసాజ్‌కు కూడా అధిక ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీని వ‌ల్ల కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది.

Read Also :http://గర్భనిరోధక మాత్రల వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతున్నదా?

Foot Massage

డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు

మ‌న శ‌రీరంలో భిన్న అవ‌య‌వాల‌కు మ‌సాజ్ చేస్తే భిన్న ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అయితే దాదాపు అన్ని అవ‌య‌వాల‌ను క‌లిపే నాడులు మాత్రం పాదాల‌కు అనుసంధాన‌మై ఉంటాయి. అందువ‌ల్ల పాదాల‌కు మ‌సాజ్ (Foot Massage) చేస్తే అనేక అవ‌య‌వాలు, క‌ణాలు ఉత్తేజితం చెందుతాయి. దీంతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక‌నే ఫుట్ మ‌సాజ్‌కు అంత‌టి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఫుట్ మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో రాత్రి పూట నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, మాన‌సిక ఆరోగ్యం స‌రిగ్గా లేని వారికి ఫుట్ మ‌సాజ్ ఎంతో దోహ‌దం చేస్తుంది. దీని వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పాదాల వాపులను త‌గ్గించుకోవచ్చు

ఫుట్ మ‌సాజ్ వ‌ల్ల శ‌రీరంలోని అనేక నాడులు యాక్టివేట్ అవుతాయి. దీంతో శ‌రీరానికి ఉత్తేజం ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అల‌స‌ట త‌గ్గుతాయి. బ‌ద్ద‌కం పోతుంది. ఇక ఫుట్ మ‌సాజ్ వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నాడులు రిలాక్స్ అవుతాయి. హార్మోన్ల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల నెల‌స‌రి స‌క్ర‌మంగా వ‌స్తుంది. రుతు స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. అధిక ర‌క్త‌స్రావం ఉండ‌దు. మెనోపాజ్ ద‌శ‌లో ఉండే మ‌హిళ‌లు చికాకు, ఆందోళ‌నను త‌గ్గించుకోవచ్చు. శ‌రీరం అసౌక‌ర్యంగా ఉంద‌న్న భావ‌న తొల‌గిపోతుంది. గ‌ర్భిణీల‌కు ఫుట్ మ‌సాజ్ వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. పాదాల వాపులను త‌గ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. సుఖ ప్ర‌స‌వం అయ్యేందుకు వీలు క‌లుగుతుంది. పాదాల్లో నీరు త‌గ్గి వ్యాధులు రాకుండా ఉంటాయి.

Foot Massage

త‌ల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది

ఫుట్ మ‌సాజ్ వ‌ల్ల క‌ళ్ల‌కు సంబంధించిన అనేక నాడులు ఉత్తేజితం చెందుతాయి. దీని వ‌ల్ల కంటి చూపు మెరుగు ప‌డుతుంది. కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కండ‌రాల‌కు కూడా ఈ మ‌సాజ్ ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల కండ‌రాల బ‌ల‌హీన‌త తొల‌గిపోతుంది. కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. అలాగే మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డి యాక్టివ్‌గా మారుతారు. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శక్తి పెరుగుతాయి. మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. వృద్ధాప్యంలో అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఫుట్ మ‌సాజ్ వ‌ల్ల త‌ల‌కు అనుసంధానం అయి ఉండే నాడులు సైతం ఉత్తేజితం చెందు తాయి. దీని వ‌ల్ల త‌ల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. పాదాల‌కు, వెన్నెముక‌కు క‌లిపే నాడులు పాదాల‌లో ఉంటాయి. క‌నుక పుట్ మ‌సాజ్ చేస్తే ఆయా నాడులు సైతం యాక్టివేట్ అవుతాయి. దీని వ‌ల్ల వెన్నెముక‌కు శ‌క్తి ల‌భించి వెన్నెముక బ‌లంగా మారుతుంది. ఇలా ఫుట్ మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ఫుట్ మసాజ్ శాస్త్రీయ పేరు?

రిఫ్లెక్సాలజీ అనేది ప్రధానంగా పాదాలు, చేతులు మరియు చెవులపై ఒత్తిడిని ఉపయోగించడంపై దృష్టి సారించే ఒక పరిపూరక చికిత్స. వివిధ పరిస్థితులలో లక్షణాల నిర్వహణ మరియు మెరుగుదలలో సానుకూల ఫలితాలను పొందవచ్చని చిన్నగా కానీ పెరుగుతున్న ఆధారాల ఆధారం సూచిస్తుంది.

ఫుట్ మసాజ్ రకాలు?

స్వీడిష్ ఫుట్ మసాజ్ అనేది అత్యంత సాధారణమైన మసాజ్ రూపంగా పరిగణించబడుతుంది మరియు దీనిని వృత్తాకార కదలికలు మరియు దీర్ఘ స్ట్రోక్స్ చేయడం ద్వారా చేస్తారు, ఇది పాదాలకు శక్తినివ్వడానికి సహాయపడుతుంది. కొంతమంది రిఫ్లెక్సాలజీ ఫుట్ మసాజ్ చేయమని ఎంచుకోవచ్చు మరియు ఇది శరీరంలోని వివిధ ప్రాంతాలలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News Foot Massage health benefits latest news relaxation stress relief Telugu News wellness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.