📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Fatty Liver : ఫ్యాటీ లివ‌ర్ తో బాధ‌ప‌డుతున్నారా..?

Author Icon By Sudha
Updated: February 4, 2026 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ర‌క్తం నుండి విషాన్ని తొల‌గించ‌డంలో, హానిక‌ర‌మైన ప‌దార్థాల‌ను విచ్చినం చేయ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వాడే మందుల నుండి వ‌చ్చే విషాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా కాలేయం త‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అలాగే పిత్తాన్ని విడుద‌ల చేసి జీర్ణ‌క్రియ‌లో కూడా కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. కొవ్వుల‌ను విచ్చినం చేయ‌డంలో, శ‌రీరం పోష‌కాల‌ను గ్ర‌హించేలా చేయ‌డంలో ఈ పిత్త ర‌సం పాత్ర ఎంతో ఉంది. కానీ మారిన మ‌న జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీలివ‌ర్ (Fatty Liver)స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. క‌నుక కాలేయ ఆరోగ్యంపై కూడా జాగ్ర‌త్త వ‌హించ‌డం చాలా అవ‌స‌రం.

Read Also : http://HIV India: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నహెచ్ఐవి మరణాలు..

Fatty Liver

మెగ్నీషియం ఉండే ఆహారాలు


జీవ‌న శైలిలో మార్పులు చేసుకోవ‌డంతో పాటు స‌రైన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. అలాగే మెగ్నీషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ (Fatty Liver)స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. మెగ్నీషియం ఉండే ఆహారాలు ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంతో పాటు శ‌రీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయ‌ని వారు చెబుతున్నారు. గుమ్మ‌డి గింజ‌ల‌ను అవ‌కాడాతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అవ‌కాడో చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంతో పాటు కాలేయ ప‌నితీరుకు కూడా మ‌ద్ద‌తును ఇస్తుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు కాలేయం డిటాక్సిఫికేష‌న్ ను మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక గుమ్మ‌డి గింజ‌ల‌ల్లో ఉండే మెగ్నీషియం, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు కాలేయం వాపును త‌గ్గించ‌డంలో, ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని తగ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

పొట్టు మిన‌ప‌ప్పు


అదే విధంగా పాల‌కూర, ఆలివ్ ఆయిల్ ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. పాల‌కూర‌లో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. ఇది కాలేయం ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోవ‌డాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పాల‌కూర‌లో ఉండే నైట్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఎంజైమ్ ల స్థాయిల‌ను మెరుగుప‌రుస్తాయి. అలాగే ఆలివ్ ఆయిల్ శోథ నిరోధ‌క ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ వాపు త‌గ్గుతుంది. ఇక పొట్టు మిన‌ప‌ప్పు కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీనిలో ఫైబ‌ర్ తో పాటు పోష‌కాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. మిన‌పప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోవ‌డం కూడా త‌గ్గుతుంది. దీనిలో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్, పాలీఫినాల్స్ ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి కాలేయ వ్యాధులు రాకుండా కాపాడ‌తాయి.

Fatty Liver

సోయాబీన్స్


కాలేయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో డార్క్ చాక్లెట్ కూడా మ‌న‌కు ఉప‌యోగప‌డుతుంది. దీనిలో ఎపికాటెచిన్, కాటెచిన్ అనే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి కాలేయ వాపును త‌గ్గిస్తాయి. దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివర్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. సోయాబీన్స్ కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోవ‌డాన్ని త‌గ్గిస్తాయి. సోయాలో జెనిస్టీన్, డైడ్జిన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవ‌డాన్ని త‌గ్గిస్తాయి. అలాగే బాదం, జీడిప‌ప్పులో కూడా మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఫ్యాటీలివ‌ర్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గి కాలేయ వ్యాధుల ప్ర‌మాదం కూడా త‌గ్గుతుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ తో పాటు ఇత‌ర కాలేయ స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆహారాల్లో పోష‌కాలు కూడా అధికంగా ఉంటాయి క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర మొత్తం ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News fatty liver Fatty Liver Disease health issues latest news Lifestyle Diseases Liver Health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.