📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Salt : ఉప్పును అతిగా తింటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..!

Author Icon By Sudha
Updated: July 9, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉప్పు లేకుండా అస‌లు ఏ వంట‌కమూ పూర్తి కాదు. రోజూ మ‌నం చేసే అనేక కూర‌లు, వంట‌కాల్లో ఉప్పును వేస్తుంటాం. కూర‌ల్లో కాస్త ఉప్పు (Salt) త‌గ్గితే చాలు వంట చేసిన వారి మీద ఇంతెత్తున గ‌య్‌మ‌ని లేస్తారు.
త‌మ‌కు స‌రిపోయినంత ఉప్పును క‌లుపుకుని తింటుంటారు. మ‌నం రోజూ కావ‌ల్సిన దానిక‌న్నా అతిగానే ఉప్పును తింటున్నామని స్వ‌యంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థే చెబుతోంది. అయితే ఇది కేవలం మ‌న దేశానికే ప‌రిమితం కాలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో స‌గ‌టు వ్య‌క్తి ఉప్పు (Salt) వినియోగం సాధార‌ణం క‌న్నా ఎక్కువ‌గానే ఉంద‌ని ప‌రిశోధ‌కులు త‌మ అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డించారు.

Salt : ఉప్పును అతిగా తింటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..!

5 గ్రాముల ఉప్పు

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్ర‌కారం ఒక వ్య‌క్తికి రోజుకు సుమారుగా 5 గ్రాముల వ‌ర‌కు ఉప్పు (Salt) స‌రిపోతుంది. అంటే ఒక టీస్పూన్ మోతాదులో ఉప్పును తింటే చాల‌న్న‌మాట‌. అందులో సుమారుగా 2 గ్రాముల వ‌ర‌కు సోడియం ఉంటుంది. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతున్న ప్రకారం రోజుకు 1.5 గ్రాముల వ‌ర‌కు మ‌న శ‌రీరానికి సోడియం కావాలి. అంత‌క‌న్నా మించితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. హైబీపీ ఉన్న‌వారు అయితే రోజుకు 5 గ్రాముల క‌న్నా త‌క్కువ మోతాదులోనే ఉప్పును తినాలి. లేదా 1.5 గ్రాముల క‌న్నా త‌క్కువ‌గా సోడియం అందేలా చూసుకోవాలి. లేదంటే తీవ్ర దుష్ప‌రిణామాలు (Side effects) ఉంటాయ‌ని అంటున్నారు.

రెట్టింపు మోతాదు

ప్ర‌పంచ వ్యాప్తంగా స‌గ‌టున ఒక వ్య‌క్తి రోజుకు 9 నుంచి 12 గ్రాముల వ‌ర‌కు ఉప్పును తింటున్నాడ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని క‌న్నా రెట్టింపు మోతాదులో ఉండ‌డం గ‌మ‌నార్హం. భార‌త్ విష‌యానికి వ‌స్తే ఒక వ్య‌క్తి స‌గ‌టున రోజుకు 10.9 గ్రాముల వ‌ర‌కు ఉప్పును తింటున్న‌ట్లు తేలింది. ఇండియ‌న్ హైప‌ర్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్ ఇనిషియేటివ్ వారు ఈ విష‌యాన్ని చెప్పారు. చైనాలో ఒక వ్య‌క్తి సుమారుగా రోజుకు 11 గ్రాముల వ‌ర‌కు ఉప్పును తింటుండ‌గా, అమెరికాలో 8.5 గ్రాముల మేర ఉప్పును తింటున్నార‌ని వెల్ల‌డైంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని క‌న్నా ఆయా దేశాల్లోని ప్ర‌జ‌లు ఎక్కువ‌గానే ఉప్పును తింటుండ‌డం గ‌మ‌నార్హం. ఇది తీవ్ర‌మైన వ్యాధులకు దారి తీస్తోంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

Salt : ఉప్పును అతిగా తింటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..!

ఫుడ్స్‌ను తిన‌డం త‌గ్గించాలి


ఉప్పును అధికంగా తింటే హైబీపీ, గుండె జ‌బ్బులు లేదా గుండె పోటు, కిడ్నీ వ్యాధులు, జీర్ణాశ‌య క్యాన్స‌ర్‌, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. 2021లో న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్ర‌చురితం అయిన ఓ అధ్య‌య‌నం ప్ర‌కారం మ‌నం రోజూ తీసుకునే సోడియం ప‌రిమాణం 1 గ్రాము పెరిగినా కూడా గుండె జ‌బ్బుల‌తో చ‌నిపోయే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయ‌ని తేలింది. ఇలాంటి వారు 2030 వ‌ర‌కు సుమారుగా 90 ల‌క్ష‌ల మంది గుండె పోటు బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. సాధార‌ణంగా ఉప్పును తిన‌డం అంటే నేరుగా తిన‌డం అనుకుంటారు కానీ మ‌నం రోజూ తినే అనేక ఆహారాల్లో ఉప్పు అధికంగా ఉంటుంద‌ని, క‌నుక ఆయా ఆహారాల‌ను తిన‌కూడ‌ద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా ఊర‌గాయ‌, అప్ప‌డాలు, చ‌ట్నీలు, ప్యాక్ చేయ‌బ‌డిన ఫుడ్స్‌, చిప్స్‌, బ్రెడ్‌, బిస్కెట్లు, రెస్టారెంట్ల‌లో మీల్స్‌, బ‌ట‌ర్‌, చీజ్ వంటి వాటిని తింటే మ‌న‌కు మోతాదు క‌న్నా అధికంగా ఉప్పు ల‌భిస్తుంద‌ని, క‌నుక ఈ ఫుడ్స్‌ను తిన‌డం త‌గ్గించాల‌ని సూచిస్తున్నారు. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

4 రకాల లవణాలు ఏమిటి?

ఆమ్ల లవణం, ప్రాథమిక లవణం, తటస్థ లవణం మరియు డబుల్ లవణం అనే వివిధ రకాల లవణాలు ఉన్నాయి. బలహీనమైన క్షారానికి మరియు బలమైన ఆమ్లానికి మధ్య జరిగే ప్రతిచర్య ఫలితంగా ఏర్పడే లవణాన్ని ‘ఆమ్ల లవణం’ అంటారు.

ఉప్పు అసలు పేరు ఏమిటి?

సోడియం క్లోరైడ్ సాధారణంగా తినదగిన ఉప్పు అని పిలుస్తారు, ఇది NaCl అనే రసాయన సూత్రంతో కూడిన అయానిక్ సమ్మేళనం, ఇది సోడియం మరియు క్లోరైడ్ అయాన్ల 1:1 నిష్పత్తిని సూచిస్తుంది.

ఉప్పు గురించి 5 వాస్తవాలు ఏమిటి?

ఆరోగ్య వాస్తవాలు మన శరీరానికి ప్రతి 40 కిలోల బరువుకు 100 గ్రాముల ఉప్పు అవసరం. కణాలలోని అన్ని సంకేతాల పనితీరులో, అలాగే మెదడుకు మరియు నుండి సోడియం కీలకం. చెమటలో లీటరుకు 2.25 మరియు 3.4 గ్రాముల ఉప్పు ఉంటుంది. … సముద్ర తాబేళ్లు తమ శరీరంలోని అదనపు ఉప్పును వదిలించుకోవడానికి ఏడుస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elephant Yam : కందగడ్డతో కలిగే ప్రయోజనాలు తెలుసా..

Breaking News Health risks Heart Disease High Sodium Intake latest news Salt Consumption Stroke Risk Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.