పళ్ల ఆరోగ్యం(Healthy Teeth) బాగుంటే మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజువారీ ఆహారంలో సరైన పోషకాలు ఉండటం ఎంతో అవసరం.
Read Also: Cancer: యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక
పళ్లకు మేలు చేసే ఆహార పదార్థాలు
పాలు, పెరుగు వంటి పాడి ఉత్పత్తులు దంతాలకు అవసరమైన క్యాల్షియం, ఫాస్ఫరస్‌ను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి పళ్ల బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్‌ను అందించి దంతాల చుట్టూ ఉండే మసూళ్లను ఆరోగ్యంగా(Healthy Teeth) ఉంచుతాయి. అలాగే ఆపిల్, క్యారెట్, నారింజ, మామిడి, ఉసిరికాయ వంటి పండ్లు, చేపలు, గుడ్లు తీసుకోవడం వల్ల పళ్లకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి
పంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అధికంగా తీపి పదార్థాలు, చిప్స్, ఎక్కువ మసాలా కలిగిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. ఇవి పళ్లను పాడుచేసే బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: