సోషల్ మీడియాలో “సింగిల్ కింగ్” అంటూ ఒంటరితనాన్ని ఆస్వాదిస్తున్న యువతకు శాస్త్రవేత్తలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లిని ఆలస్యం చేస్తూ ఎక్కువకాలం ఒంటరిగా జీవించడం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ నిర్వహించిన తాజా పరిశోధన వెల్లడించింది.
Read Also: IIT Hyderabad: చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి
16 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పరిశోధన
జర్మనీ, బ్రిటన్ దేశాలకు చెందిన సుమారు 17,000 మందిపై 16 ఏళ్ల పాటు జరిపిన అధ్యయనంలో, వయస్సు పెరుగుతున్న కొద్దీ సింగిల్‌గా ఉన్నవారిలో జీవితంపై సంతృప్తి వేగంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 25 ఏళ్లు దాటిన తర్వాత ఒంటరితనం తీవ్రమై డిప్రెషన్(Depression) వంటి మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
ఈ మానసిక ప్రభావం పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా కనిపిస్తోందని డాక్టర్ మైఖేల్ క్రామర్ వెల్లడించారు. 20 ఏళ్ల చివరి దశలో ఉన్న సింగిల్స్‌లో డిప్రెషన్ లక్షణాలు మరింత స్పష్టంగా ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.
రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి భిన్నమైన ఫలితాలు
అదే వయసులో ప్రేమలో ఉన్నవారు లేదా వివాహం చేసుకున్నవారిలో మాత్రం జీవితంపై సంతృప్తి పెరిగినట్లు, ఒంటరితనం తగ్గినట్లు పరిశోధకులు(Depression) గుర్తించారు. పెళ్లిని లేదా మొదటి సంబంధాన్ని ఎక్కువకాలం వాయిదా వేయడం వల్ల మానసిక ధైర్యం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఎవరికెక్కువ ప్రమాదం?
చదువుపై మాత్రమే దృష్టి పెట్టే వారు, ఒంటరిగా నివసించే వారు, తల్లిదండ్రులతోనే ఎక్కువకాలం ఉండిపోయే వారు సింగిల్‌గా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలిక ఒంటరితనం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగి, భవిష్యత్తులో రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఒంటరితనం మానసిక ఒత్తిడికి దారితీస్తుందని, ఆ ఒత్తిడి శరీరంపై కూడా ప్రభావం చూపుతుందని మనస్తత్వవేత్త డాక్టర్ ఆడమ్ బోర్లాండ్ తెలిపారు. అందుకే పూర్తిగా ఒంటరిగా ఉండడం కంటే, భాగస్వామ్యంతో జీవించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: