📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tomato : ప్రతిరోజూ టమాటా తింటే ఏమవుతుందో తెలుసా..

Author Icon By Sudha
Updated: January 10, 2026 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కూరగాయల్లో టమాటా ప్రత్యేకతే వేరు. ఏ వంటలోనైనా ఇట్టే ఒదిగిపోయే టమాటా లేకుండా అది పూర్తికాదు. వివిధ రకాల కూరగాయలు, సలాడ్‌లతో సహా అనేక వంటలలో ఉపయోగిస్తారు. టమోటా (Tomato)లతో ప్రత్యేక సూప్‌లు, సాస్‌లు, చట్నీలను కూడా తయారు చేస్తారు. వంటల రుచిని పెంచే ఈ జ్యుసి టమాటాలు మంచి పోషకాహారంగా పనిచేస్తాయి. ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కానీ, ప్రతిరోజూ టమోటాలు (Tomato)తినడం వల్ల మీ శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం, చర్మం, జీర్ణవ్యవస్థకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి.

Read Also: Sankranthi: పిండి వంటలు కరకరలాడాలంటే ఈ కిచెన్ టిప్స్ పాటించండి

Tomato

రోజూ పచ్చి టమాటా తింటే బీపీ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. టమాటాలో విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి ఇది చాలా కీలకం. టమాటా యాంటీ ఆక్సిడెంట్ లా కూడా పని చేస్తుంది. బాడీ సెల్స్ డ్యామేజ్ కాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. స్కిన్ ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. టమాటాతో జీర్ణ శక్తి పెరుగుతుంది. అందుకు కారణం ఏంటంటే..టమాటాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే టమాటాలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. బ్లడ్ క్లాటింగ్ లేకుండా చూస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News daily tomato intake health benefits latest news nutrition Telugu News Tomato Tomato Benefits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.