📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

walking : రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

Author Icon By Sudha
Updated: January 30, 2026 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనమందరం ఏదో ఒక సమయంలో అనుకుంటాం..నేను రేపు ఖచ్చితంగా జిమ్‌కి వెళ్తాను, లేదంటే వ్యాయామం చేస్తాను అని. కానీ ఉదయం నిద్రలేమి, చలి వాతావరణం, అత్యవసర పనులు లేదంటే, మరితనం కారణంగా ఆ వాయిదా వేయబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఒక సులభమైన మార్గం ఉంది..జిమ్‌ను వదిలేసి నడవడం ప్రారంభించండి. ఇది కేవలం నడవడం మాత్రమే కాదు, సరిగ్గా నడవడం కూడా ముఖ్యం. ఇంటి పనులు చేయడం, దుకాణానికి వెళ్లడం లేదా ఆఫీసు చుట్టూ తిరగడం వ్యాయామం కాదు. ఫిట్‌నెస్ నడక భిన్నంగా ఉంటుంది. ఇందులో కొంచెం వేగవంతమైన వాకింగ్‌, లోతైన శ్వాస, శరీరం వెడెక్కాల్సి ఉంటుంది. గంటకు 5 కి.మీ వేగంతో నడవడం(walking) వల్ల హృదయ స్పందన రేటు సరైన స్థాయికి పెరుగుతుంది. ఇది మధ్యస్థ స్థాయి. ఇక్కడ శరీరం కొవ్వును కాల్చడం, శక్తిని పెంచడం ప్రారంభిస్తుంది. అడపాదడపా నడవడం (walking)వల్ల ప్రయోజనాలను తగ్గిస్తుంది. మీరు 30 నిమిషాలు బయట ఉండి, మధ్యలో మీ ఫోన్ చూసుకున్నారనుకుందాం, ఎవరితోనైనా మాట్లాడటానికి ఆగినారనుకుందాం లేదా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎక్కువసేపు వేచి ఉన్నారనుకుందాం, అప్పుడు శరీరం చేసిన కృషి మళ్లీ మళ్లీ రీసెట్ అవుతుంది. ఫిట్‌నెస్ కోసం స్థిరమైన కదలిక చాలా అవసరం. మీరు ఆగకుండా కదిలినప్పుడు, మీ గుండె, ఊపిరితిత్తులు, కండరాలు ఒక లయలో పనిచేస్తాయి. ఈ స్థిరత్వం నిజమైన ప్రయోజనాలను అందిస్తుంది.

Read Also : http://Healthy Diet: థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

walking

మీ వేగం సరైనదని ఎలా అర్థం చేసుకోవాలి?: దీని గురించి పెద్దగా సాంకేతికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ నియమాన్ని గుర్తుంచుకోండి. మీరు 30 నిమిషాల్లో 2.5 కిలోమీటర్లు నడిస్తే, మీ వేగం సరైనది. ఈ వేగంతో, మీ శరీరం ఐదు నిమిషాల తర్వాత చురుగ్గా అనిపించడం ప్రారంభిస్తుంది. సరైన స్థలం, సరైన సమయాన్ని ఎంచుకోవడం ముఖ్యం. మీరు ప్రతి రెండు నిమిషాలకు ఆపవలసి వస్తే, మీరు వేగాన్ని కోల్పోతారు. కాబట్టి, నడవడానికి ప్రయత్నించండి. ఏదైనా పార్క్‌, లేదంటే, కాలనీలోని ప్రశాంతమైన వీధి లేదా పొడవైన కాలిబాటను ఎంచుకోండి. ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయాన్ని ఎంచుకోండి. ప్రతిరోజూ ఒకే సమయంలో నడవండి, ఉదాహరణకు ఉదయం లేదా సాయంత్రం. అది మీ దినచర్యలో భాగమైనప్పుడు, సాకులు తగ్గుతాయి. నడుస్తున్నప్పుడు మీ మొబైల్‌ను దూరంగా ఉంచండి. ప్రతి ఫోన్ నోటిఫికేషన్ కోసం వేచి ఉండటం వల్ల మీ వ్యాయామం పాడవుతుంది. అందువల్ల ఫోన్ ని సైలెంట్‌లో పెట్టండి. సమయం చూడటానికి మీ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌ని చూడండి. మీ నడక తర్వాత కాల్స్ లేదా సందేశాలకు సమాధానం ఇవ్వండి. ఈ 30 నిమిషాలు మీ శరీరానికి, మనసుకు మాత్రమే ఉపయోగపడాలి. జిమ్‌ కంటే వాకింగ్‌ ఎందుకు మంచి ప్రత్యామ్నాయం అవుతుంది..? చురుకైన నడక గుండెను బలపరుస్తుంది. బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా వేగంగా నడటం వల్ల కేలరీలు బర్న్‌ అవుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. అత్యుత్తమమైన విషయం ఏమిటంటే ఇది సులభం, ఉచితం, ఎక్కడైనా చేయవచ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

30 minutes walking Breaking News daily walking fitness lifestyle health tips latest news Telugu News walking benefits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.