📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : CPR : గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

Author Icon By Sudha
Updated: December 3, 2025 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌ల‌తో మృతి చెందుతున్న వారి సంఖ్య ఏటా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. భార‌త్‌లో ఈ సంఖ్య మ‌రీ అధికంగా ఉంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌న దేశంలో ప్ర‌తి గంట‌కు గుండె జ‌బ్బులు లేదా హార్ట్ ఎటాక్‌ల కార‌ణంగా సుమారుగా 250 మంది మ‌ర‌ణిస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. 2007 నుంచి 2013 మ‌ధ్య కాలంలో గుండె జ‌బ్బుల మ‌ర‌ణాల శాతం 22 ఉండ‌గా, 2021-23 మ‌ధ్య కాలంలో అది ఏకంగా 9 శాతం పెరిగి 31కి చేరుకుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్ర‌తి ఒక్క‌రు త‌మ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే చాలా వ‌ర‌కు గుండె సంబంధ మ‌ర‌ణాల్లో హాస్పిటల్‌కు స‌రైన స‌మ‌యంలో రాక‌పోవ‌డం వ‌ల్లే సంభ‌విస్తున్నాయ‌ని అంటున్నారు. క‌నుక స‌రైన స‌మ‌యంలో బాధితుల‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించి చికిత్స అందిస్తే ప్రాణాల‌ను కాపాడుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే ఇందుకు బాధితుల‌కు గుండె పోటు వ‌చ్చిన వెంట‌నే సీపీఆర్ (CPR) చేయాల్సి ఉంటుంద‌ని సూచిస్తున్నారు.

Read Also: http://Fenugreek Risks: మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

CPR

సీపీఆర్ గురించి..

గుండె పోటు వ‌చ్చిన వారికి వెంట‌నే సీపీఆర్ చేస్తే వారు జీవించే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా పెరుగుతాయ‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. అయితే చాలా మందికి సీపీఆర్ పై అవ‌గాహ‌న లేదు. అనేక మందికి అస‌లు సీపీఆర్ అంటేనే తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే సీపీఆర్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెర‌గాల‌ని వారు అంటున్నారు. సీపీఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (CPR) అని పూర్తి అర్థం వ‌స్తుంది. గుండె పోటు వ‌చ్చిన వారికి సీపీఆర్ చేస్తే గుండె కండ‌రాల‌కు జ‌రిగే న‌ష్టం చాలా వ‌ర‌కు నివారించ‌బ‌డుతుంది. ఈ క్ర‌మంలో వారిని స‌కాలంలో హాస్పిట‌ల్‌లో చేర్పించి చికిత్స అందిస్తే చాలా వ‌ర‌కు న‌ష్టం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల గుండెకు ఎలాంటి హాని జ‌ర‌గ‌దు. దీర్ఘ‌కాలంలోనూ గుండెకు ఎలాంటి ముప్పు వాటిల్ల‌దు. అలాగే బాధితులు ఎక్కువ కాలం పాటు జీవించి ఉండే అవ‌కాశాలు పెరుగుతాయి. అయితే సీపీఆర్ ఎలా చేయాల‌నే వివ‌రాల‌ను వైద్యులు వెల్ల‌డిస్తున్నారు.

ఎలా చేయాలి..

గుండె పోటు లేదా కార్డియాక్ అరెస్ట్ అయిన వారికి సీపీఆర్ చేయాలి. దీని వ‌ల్ల వారి ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు. ఇక సీపీఆర్ చేసేందుకు గాను ఈ స్టెప్స్‌ను అనుస‌రించాల్సి ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ లేదా గుండె పోటు వ‌చ్చిన వారిని ముందుగా నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకోబెట్టాలి. త‌రువాత ఒక అర‌చేతిని మ‌రో అర‌చేతిపై ఉంచి రెండు చేతుల‌తో బాధితుల‌ ఛాతి మ‌ధ్య‌లో 30 సార్లు ప్రెస్ చేస్తూ ఒత్తిడి క‌లిగించాలి. ఈ ప్ర‌క్రియ‌ను సున్నితంగా చేయాలి. త‌రువాత 2 సార్లు నోటితో శ్వాస ఇవ్వాలి. ఇలా బాధితుల‌కి స్పృహ వ‌చ్చే వ‌ర‌కు చేయాలి. ఇక చిన్నారుల‌కు అయితే ఛాతి మ‌ధ్య‌లో ఒక చేతితో అదిమితే చాలు. అదే శిశువుల‌కు అయితే ఛాతి మ‌ధ్య‌లో రెండు వేళ్ల‌తో అద‌మాలి. ఇలా బాధితుల‌కు సీపీఆర్ చేయాల్సి ఉంటుంది.

CPR

ఎంతో మేలు చేస్తుంది

సీపీఆర్ చేయ‌డం వ‌ల్ల శ‌రీర భాగాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌రించ‌బ‌డుతుంది. ఆగిపోయిన గుండె తిరిగి ప్రారంభం అవుతుంది. గుండె ద్వారా ర‌క్తం పంపింగ్ మొద‌ల‌వుతుంది. దీంతో మెద‌డుకు కూడా ర‌క్త స‌ర‌ఫరా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల బాధితులు స్పృహ‌లోకి వ‌స్తారు. ప్రాణాపాయం త‌ప్పుతుంది. త‌రువాత కొన్ని గంట‌ల్లోగా హాస్పిట‌ల్‌లో చేరినా చాలు, దీంతో ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌చ్చు. ఇలా సీపీఆర్ ప్ర‌క్రియ గుండె పోటు బాధితుల‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇక సీపీఆర్ చేయ‌డం వ‌ల్ల అలాంటి స్థితిలో ఉన్న చాలా మందిని ర‌క్షించుకోవ‌చ్చు. ఛాతిపై ఒత్తిడి క‌లిగిస్తూ అద‌మ‌డంతోపాటు నోట్లో నోరు పెట్టి శ్వాస అందించాలి. ఇలా చేస్తేనే సీపీఆర్ పూర్తి చేసిన‌ట్లు అవుతుంది. అలా కాకుండా కేవ‌లం ఛాతిపై ఒత్తిడి క‌లిగించ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం ఉండ‌దు. క‌నుక సీపీఆర్ ప్ర‌క్రియ‌ను స‌రైన రీతిలో చేయాల్సి ఉంటుంది. అయితే దీనిపై మరింత స‌మాచారం తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడ‌వ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews Cardiac Arrest CPR first aid heart attack latest news life saving Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.