పోషకాల భాండాగారమే కానీ జాగ్రత్తలు అవసరం!
చియా సీడ్స్‌ను అనేక మంది తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇందులో ఫైబర్,(Fiber) ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్(Chia seeds) మరియు మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి “సూపర్ ఫుడ్” గా గుర్తింపు పొందాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లకు, మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే, ఈ గింజల్ని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also: డేంజర్ జోన్‌లోకి ప్రవేశించిన టాప్ కంటెస్టంట్స్
ఎక్కువ మోతాదులో తినడమ వల్ల కలిగే దుష్ప్రభావాలు
చియా సీడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా నీటిలో నానబెట్టకుండా తిన్నపుడు, అవి జీర్ణించుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమంది పొడిగా తినడం వలన గొంతులో ఇరుకుగా ఉండిపోయే అవకాశం ఉంటుంది.
చియా సీడ్స్ పాల ఉత్పత్తులతో కలిపి తీసుకున్నపుడు ఇవి గట్టి జెల్ లా మారి, మరింత మందపాటి ద్రవంగా తయారవుతాయి. దీని వల్ల జీర్ణం (Chia seeds) మందగిస్తుంది. అదే సమయంలో చాలా మందికి వీటి వల్ల అలెర్జీ సమస్యలు కూడా ఏర్పడవచ్చు. చర్మంపై దద్దుర్లు, కళ్లలో నీరు కారడం, శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
అంతేకాకుండా, లో బీపీ ఉన్నవారు చియా సీడ్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే, రక్తం పల్చగా మారే ప్రభావం కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రక్తం పల్చబోయే మందులు వాడుతున్న వారు వీటిని తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
ఏ పండ్లతో కలిపి తినకూడదు
చియా సీడ్స్‌ను సిట్రస్ ఫ్రూట్స్ (నారింజ, ద్రాక్ష) వంటివాటితో కలిపి తినకూడదు. ఇవి అంబటిగా ఉండటం వల్ల, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే, అరటిపండు, యాపిల్ వంటివాటితో కలిపి తినడంలో ఇబ్బంది ఉండదు.
ఇంకా, డైట్‌లో ఉన్నవారు కూడా చియా సీడ్స్ మోతాదు మించి తీసుకుంటే, అందులో ఉన్న అధిక కేలరీల వలన బరువు పెరగొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలకంటే విరుద్ధంగా బరువు పెరగే ప్రమాదం ఉంది.
చియా సీడ్స్ నీటిలో ఎందుకు నానబెట్టాలి?
నానబెట్టిన చియా సీడ్స్ జీర్ణానికి సులభంగా మారతాయి. పొడిగా తింటే గొంతులో ఇరుకుగా ఉండిపోయే ప్రమాదం ఉంది.
ఎవరెవరు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి?
లో బీపీ, రక్తం పల్చబడే ఔషధాలు తీసుకునేవారు, అలెర్జీ ఉన్నవారు, చిన్నపిల్లలు చియా సీడ్స్ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: