ప్రస్తుతం భారతీయులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లల్లో క్యాన్సర్ కూడా ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పవచ్చు. జీవన విధానంలో మార్పులు, ధూమపానం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, రేడియేషన్ కు ఎక్కువగా గురవ్వడం, రసాయనాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే ఈ వ్యాధికి సరైన మందు లేదనే విషయం మనందరికీ తెలిసిందే. కనుక వ్యాధి బారిన పడి బాధపడడానికి బదులుగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మన ఆహారంలో మార్పులు చేసుకోవడం మరింత అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read Also : Health: థైరాయిడ్ నియంత్రణకు సరైన డైట్ ఇదే
మామిడి, నేరేడు..
క్యాన్సర్ (Cancer)ప్రమాదాన్ని తగ్గించడంలో కొన్ని రకాల పండ్లు మనకు ఎంతగానో దోహదపడతాయని వారు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ (Cancer)కణాల పెరుగుదల తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే పండ్ల గురించి వివరాలను అందిస్తున్నారు. మామిడి పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అసాధారణ కణాల పెరుగుదల వేగం తగ్గుతుంది. అలాగే నేరేడు పండ్లు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో మనకు సహాయపడతాయి. వీటిలో యాంటీ ప్రొలిఫెరేటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి హానికారక కణాల వ్యాప్తిని తగ్గించడంలో దోహదపడతాయి.
ఉసిరి, మారేడు..
ఉసిరికాయలను తీసుకోవడం వల్ల కూడా మనం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఉసిరిలో ప్రీక్లినికల్ నమూనాలు ఉంటాయని వీటి సారం క్యాన్సర్ పై ఆశాజనక ప్రభావాలను చూపించదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కోకుమ్ అనే పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ పండ్లల్లో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మారేడు పండ్లు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతో దోహదపడతాయని చెబుతున్నారు. ఇవి క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని వీటిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కణాలను రక్షించడంలో సహాయపడతాయని తెలియజేస్తున్నారు.
పనస, వాక్కాయలు..
అలాగే ఆహారంలో భాగంగా పనస పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ ను నిరోధించడంలో ఎంతో దోహదపడతాయి. క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో వాక్కాయ పండ్లు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే రక్షణ సమ్మేళనాలు క్యాన్సర్ మార్పులను నివారించడంలో తోడ్పడతాయి. ఇక మంకీ జాక్ ఫ్రూట్ పండ్లు కూడా క్యాన్సర్ అభివృద్ధిని తగ్గిస్తాయి. ఈ పండ్లు మనలో చాలా మందికి తెలియవు. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించడంలో దోహదపడతాయి. ఈ విధంగా ఈ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాప్తి తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: