📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Brown Top Millets: రాత్రి పూట బ్రౌన్ టాప్ మిల్లెట్స్ తింటే ఎంతో మంచిది

Author Icon By Sudha
Updated: June 30, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో ఆరోగ్యంపై జనాల్లో పెరిగిన అవగాహనతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మారుతున్న వారిలో చిరుదాన్యాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మిల్లెట్స్‌ (Millets) అనే చిరు ధాన్యాలు మళ్లీ పునరుజ్జీవనం పొందుతున్నాయి. వీటిలో అండు కొర్రలు (Brown Top Millets) విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే చిరు ధాన్యాల్లో (In small grains)అనేక ర‌కాలు ఉన్నా ఏ ధాన్యం దానిక‌దే కొన్ని ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఇక చిరు ధాన్యాల్లో ఒక‌టైన అండు కొర్ర‌లు కూడా ప‌లు ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉన్నాయి. వీటినే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని ఆంగ్లంలో పిలుస్తారు. అండు కొర్ర‌లు మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందించ‌డంతోపాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భించేలా చేస్తాయి. అండు కొర్ర‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

Brown Top Millets: రాత్రి పూట బ్రౌన్ టాప్ మిల్లెట్స్ తింటే ఎంతో మంచిది

ఫైబ‌ర్ అధికం
అండుకొర్ర‌ల‌ను 100 గ్రాములు తింటే మ‌న‌కు సుమారుగా 300 క్యాల‌రీల మేర శ‌క్తి లభిస్తుంది. పిండి ప‌దార్థాలు 63 గ్రాములు, ఫైబ‌ర్ 16 గ్రాములు, ప్రోటీన్లు 13 గ్రాములు, కొవ్వు 4 గ్రాములు, క్యాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, జింక్‌, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్లు బి3, బి1, బి2, ఫైటో కెమిక‌ల్స్ ల‌భిస్తాయి. అండుకొర్ర‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను పెంపొందిస్తుంది. పేగుల్లో మ‌లం క‌ద‌లిక‌ల‌ను నియంత్రిస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గిపోతుంది. అండుకొర్ర‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. అండుకొర్ర‌ల‌ను తింటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు
అండుకొర్ర‌లలో పిండి ప‌దార్థాలు ఉన్న‌ప్ప‌టికీ ఇవి సంక్లిష్ట‌మైన‌వి. పైగా వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ కూడా చాలా త‌క్కువ‌. అందువ‌ల్ల అండుకొర్ర‌ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. పైగా వీటిల్లో ఉండే ఫైబ‌ర్‌, సంక్లిష్ట‌మైన పిండి ప‌దార్థాలు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గేలా చేస్తాయి. క‌నుక డయాబెటిస్ ఉన్న‌వారు అండుకొర్ర‌ల‌ను తింటుంటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్న వారు కూడా అండుకొర్ర‌ల‌ను తింటుండాలి. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ వ‌ల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. క‌డుపు నిండిన భావ‌న‌తో ఉంటారు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. అండుకొర్ర‌ల‌ను తింటుంటే బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు.
ఎముక‌లు దృఢం
అండుకొర్రలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) త‌గ్గుతుంది. వీటిల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరిగేలా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. అండు కొర్ర‌ల్లో క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇవి ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక‌లు దృఢంగా మారేలా చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఫ్లేవ‌నాయిడ్స్‌, క్వినోన్స్‌, టానిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా ల‌భిస్తాయి. ఇవి క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా చూస్తాయి. క్యాన్స‌ర్ల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. ఇలా అండ‌కొర్ర‌ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు.

Read Also:High pressure: అధిక ఒత్తిడితోనే నిద్రకు దూరం అవుతున్న నేటి తరం

Benefits of eating Brown Top Millets at night Best millets to eat at night Breaking News in Telugu Brown Top Millet dinner recipes Brown Top Millet health benefits Brown Top Millets at night Brown Top Millets for weight loss Google news Google News in Telugu Is it good to eat millets for dinner Latest News in Telugu Millets for diabetic diet Millets for digestion and sleep Night meal with Brown Top Millets Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.