हिन्दी | Epaper
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Latest Telugu News : Brown Rice Vs Red Rice : బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ రెడ్ రైస్‌..

Sudha
Latest Telugu News : Brown Rice Vs Red Rice : బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ రెడ్ రైస్‌..

ఆరోగ్యంగా ఉండేందుకు గాను చాలా మంది ప్ర‌స్తుతం తెల్ల అన్నంకు బ‌దులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. బ్రౌన్ రైస్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. తెల్ల అన్నానికి బ‌దులుగా రోజూ బ్రౌన్ రైస్‌ను తింటే ప‌లు వ్యాధుల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చు. అయితే రైస్‌లో కేవ‌లం బ్రౌన్ రైస్ మాత్ర‌మే కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన రైస్ వెరైటీలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిల్లో రెడ్ రైస్ కూడా ఒక‌టి. ఈ వెరైటీ కూడా మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. అయితే దీని రంగు కార‌ణంగా చాలా మంది దీన్ని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డరు. కానీ ఈ రైస్ కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తుంది. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్ (Brown Rice Vs Red Rice)లోనూ అనేక పోష‌కాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిలో దేన్ని మ‌నం తినాలి, ఎందులో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి..? అన్న వివ‌రాల‌ను పోష‌కాహార నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

Read Also : SkinCareTips: యువచర్మం రహస్యాలు

Brown Rice Vs Red Rice
Brown Rice Vs Red Rice

ఫైబ‌ర్ అధికం

ఫైబ‌ర్ విష‌యానికి వ‌స్తే ఇది బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్ (Brown Rice Vs Red Rice)రెండింటిలోనూ ఉంటుంది. కానీ రెడ్ రైస్‌లో ఇది కాస్త ఎక్కువ మోతాదులో ఉంటుంది. క‌నుక ఫైబ‌ర్ విష‌యంలో రెడ్ రైస్‌ను విన్న‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ బ్రౌన్ రైస్ క‌న్నా రెడ్ రైస్‌కే త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారికి బ్రౌన్ రైస్ క‌న్నా రెడ్ రైస్ ఎక్కువ మేలు చేస్తుంది. కాబ‌ట్టి ఈ విష‌యంలోనూ రెడ్ రైస్‌ను విజేత‌గా చెప్ప‌వ‌చ్చు. అలాగే బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇక ఈ రెండింటిలోనూ మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్ స‌మానంగానే ఉంటాయి. కానీ ఐర‌న్‌, జింక్ వంటి పోష‌కాలు మాత్రం రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. క‌నుక ఈ రెండు ర‌కాల రైస్‌ల‌లోనూ రెడ్ రైస్‌ను క్లియ‌ర్ విన్న‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. క‌నుక పోష‌కాల విష‌యానికి వ‌స్తే రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. కాబ‌ట్టి బ్రౌన్ రైస్‌ను తింటున్న‌వారు ఈ రైస్‌ను తింటే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది

రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ఇందులో ఫ్లేవ‌నాయిడ్స్‌, ఆంథో స‌య‌నిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక ఈ రైస్‌ను తింటే శ‌రీరంలోని వాపులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ర‌క్త నాళాల వాపులు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల అధిక మొత్తంలో ఐర‌న్‌ను పొంద‌వ‌చ్చు. ఇది ర‌క్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీని వ‌ల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. అలాగే ఈ రైస్‌ను తింటే జింక్ కూడా ఎక్కువ‌గానే ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీని వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి సీజ‌నల్ వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అలాగే పురుషుల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. అదేవిధంగా చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Brown Rice Vs Red Rice
Brown Rice Vs Red Rice

షుగ‌ర్‌ను తగ్గిస్తాయి

ఇక రెడ్ రైస్‌ను తింటే మెగ్నిషియం అధికంగా ల‌భిస్తుంది. ఇది ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పు చేస్తుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి ఈ రైస్ ఎంతో మేలు చేస్తుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల క్యాల్షియం అధికంగా ల‌భిస్తుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రైస్‌లోని మెగ్నిషియం కండ‌రాల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల రాత్రి పూట నిద్ర‌లో కాలి పిక్క‌లు ప‌ట్టుకుపోవ‌డం కూడా త‌గ్గుతుంది. రెడ్ రైస్‌ను తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. ఈ రైస్‌లో ఉండే ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు షుగ‌ర్‌ను తగ్గిస్తాయి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా రెడ్ రైస్ వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు ఉంటాయి. క‌నుక బ్రౌన్ రైస్ తింటున్న‌వారు ఈ రైస్‌ను కూడా త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోండి. దీని వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870