తమలపాకులు(Betel Leaves) కేవలం పూజలకే కాదు, జుట్టు సంరక్షణలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వీటిలో ఉన్న సహజ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు తల చర్మంలో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గించి, చుండ్రు సమస్యను నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో కురుల వేర్లను బలపరచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
Read Also: Health Crisis: మధుమేహుల సంఖ్యలో రెండో స్థానంలో భారత్
తమలపాకులతో జుట్టుకు లాభాలు
- తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది
- చుండ్రు, దురద సమస్యలను తగ్గిస్తుంది
- కురుల వేర్లకు బలం చేకూరుస్తుంది
- జుట్టు ఒత్తుగా, మెరిసేలా మారడానికి సహాయపడుతుంది
ఇంటి వద్దే చేయగల హెయిర్ ప్యాక్స్
1. హర్బల్ హెయిర్ ప్యాక్
మందార పూలు, తమలపాకులు,(Betel Leaves) కరివేపాకు, తులసి ఆకులను సమపాళ్లలో తీసుకుని పేస్ట్ చేయాలి. అందులో 2 స్పూన్ల నూనె కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
2. జుట్టు ఒత్తుగా పెరగడానికి ప్యాక్
తమలపాకుల పేస్టులో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి తలకు రాసి 30 నిమిషాల తర్వాత కడిగితే జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?
ఈ ప్యాక్స్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కెమికల్స్ లేకుండా సహజంగా జుట్టు సంరక్షణ చేయాలనుకునేవారికి ఇవి మంచి ఎంపిక.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: