📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? నేటి బంగారం ధరలు ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్ ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు మాజీ చీఫ్ లకు నోటీసులు పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? నేటి బంగారం ధరలు ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్ ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు మాజీ చీఫ్ లకు నోటీసులు పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

Copper Jewellery : రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో ?

Author Icon By Sudha
Updated: December 22, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ‌నం సాధార‌ణంగా బంగారం, వెండితో చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తూ ఉంటాం. ఇవి మ‌న‌కు ఎంతో అందాన్ని, తేజ‌స్సును తీసుకువ‌స్తాయి. అయితే ప్ర‌స్తుత కాలంలో వీటిని మ‌నం కొనుగోలు చేసే ప‌రిస్థితి లేద‌నే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బంగారం, వెండికి బ‌దులుగా మ‌నం రాగితో చేసిన ఆభ‌రణాల‌ను కూడా ధ‌రించ‌వ‌చ్చు. పూర్వ‌కాలం నుండి రాగి ఆభ‌ర‌ణాలు (Copper Jewellery)వాడుక‌లో ఉన్నాయి. రాగి కంక‌ణాలు, రాగి ఉంగ‌రాల వంటి వాటిని ధ‌రించ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ ఆభ‌ర‌ణాల‌ను శుభ్రం చేయ‌డం కూడా చాలా తేలిక‌. రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Read Also: Diabetes: సైలెంట్ కిల్లర్‌గా మారిన కిడ్నీ వ్యాధి

Copper Jewellery

ఆక్సిజ‌న్ స్థాయిలు పెరుగుతాయి

స‌హ‌జంగానే రాగి శోథ నిరోధ‌క గుణాన్ని క‌లిగి ఉంటుంది. క‌నుక రాగి ఆభ‌ర‌ణాల‌ను (Copper Jewellery) ధ‌రించ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో వాపుల‌తో బాధ‌ప‌డే వారు రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. దీంతో శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు పెరుగుతాయి. హృద‌య ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వేగం పెర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మం, వెంట్రుక‌లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే పోష‌కాలను శ‌రీరం గ్ర‌హించ‌డం కూడా చాలా అవ‌స‌రం. రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరం మ‌నం తీసుకునే ఆహారం నుండి ఖ‌నిజాల‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. ఈ ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల ఐర‌న్, జింక్ వంటి సూక్ష్మ పోష‌కాలను శ‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో శ‌రీరంలో ఐర‌న్, జింక్ వంటి పోష‌కాల లోపం లేకుండా ఉంటుంది.

Copper Jewellery

వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి

రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. కొల్లాజెన్ ఉత్ప‌త్తిని పెంచడంలో రాగి ఆభ‌ర‌ణాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం రంగు కూడా మెరుగుప‌డుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. య‌వ్వ‌నంగా ఉంటారు. రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వైర‌స్, బ్యాక్టీరియాల వల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌గ్గుతాయి. శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా రాగి ఆభ‌ర‌ణాలు మ‌న‌కు అందాన్ని తీసుకు రావ‌డ‌మే రాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

benefits of copper Breaking News Copper jewellery health benefits latest news Telugu News traditional jewellery wellness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.