📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Water : ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

Author Icon By Sudha
Updated: December 24, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ‌న శ‌రీరానికి నీరు చాలా అవ‌స‌రం. శరీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో, శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ల‌ను నియంత్రించ‌డంలో, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో నీరు మ‌న‌కు స‌హాయ‌పడుతుంది. రోజుకు క‌నీసం 4 నుండి 5 లీట‌ర్ల నీటిని (Water ) త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మ‌న‌లో చాలా మంది ఉద‌యం నిద్ర‌లేచిన త‌రువాత టీ, కాఫీ ల‌ను తాగుతూ ఉంటారు. వాటికి బ‌దులుగా ఉద‌యం పూట నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ఉద‌యం పూట నీటిని (Water) తీసుకోవ‌డం వల్ల జీవ‌క్రియ‌ల వేగం పెరుగుతుంది. మ‌న శ‌రీర ఆరోగ్యవిష‌యంలో మ‌నం గ‌ణ‌నీయ మార్పుల‌ను చూడ‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. ఉద‌యం పూట నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు అంటున్నారు.

Read Also : http://Women Health: లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

Water

శ‌రీర విధులు స‌క్ర‌మంగా

రాత్రి చాలా స‌మ‌యం నిద్రించ‌డం వల్ల శ‌రీరంలో నీటిశాతం త‌గ్గుతుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. క‌నుక ఉద‌యం లేవ‌గానే నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో నీటిశాతం పెరుగుతుంది. దీంతో శ‌రీర విధులు స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. ఉద‌యం నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల వేగం 30 శాతం వ‌రకు పెరుగుతుంది. జీవ‌క్రియ‌ల వేగం పెర‌గ‌డం వ‌ల్ల క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయ‌బ‌డ‌తాయి. దీంతో శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. మ‌నం నిద్రించిన త‌రువాత మ‌న శ‌రీరంలో డీటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ఈ స‌మ‌యంలో మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఉద‌యం నీటిని తాగ‌డం వ‌ల్ల ఈ వ్య‌ర్థాలు అన్నీ కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అంతేకాకుండా మూత్ర‌పిండాల ప‌నితీరు కూడా పెరుగుతుంది.

చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది

ఇక ఉద‌యం నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. పేగు కద‌లిక‌లు పెరుగుతాయి. దీంతో తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణాశయం ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. దీంతో మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే పోష‌కాలు శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. ఉద‌యం నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. చ‌ర్మానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెరగ‌డం వ‌ల్ల వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. చ‌ర్మానికి కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ముడ‌త‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. మెద‌డు ప‌నితీరుకు నీరు చాలా అవ‌స‌రం. డీహైడ్రేష‌న్ కార‌ణంగా మెద‌డు అభిజ్ఞా ప‌నితీరు త‌గ్గుతుంది. క‌నుక ఉద‌యం లేవ‌గానే నీటిని తాగ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త‌, చురుకుద‌నం పెరుగుతాయి. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. రోజంతా సానుకూలంగా ఉంటుంది.

Water

ఆక‌లిని అణ‌చి వేస్తుంది

ఉద‌యం పూట నీటిని తాగ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శక్తి పెరుగుతుంది. నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు, విషాలు తొల‌గిపోతాయి. దీంతో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌గ్గుతాయి. శ‌రీరంలో డీహైడ్రేష‌న్ అల‌స‌ట మాన‌సిక మార్పుల‌కు దారి తీస్తుంది. నీటిని తాగ‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ త‌గ్గి మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. నీటిని తాగ‌డం వ‌ల్ల ఆక‌లి త‌గ్గుతుంది. నీరు స‌హ‌జంగానే ఆక‌లిని అణ‌చి వేస్తుంది. అతిగా, ఎక్కువ‌గా తినే వారు భోజ‌నానికి ముందు నీటిని తాగ‌డం వ‌ల్ల ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటారు. దీంతో శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్తప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి త‌గ్గుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ఆక్సిజ‌న్, పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. ఈ విధంగా ఉద‌యం పూట నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఉద‌యం పూట టీ, కాఫీల‌కు బ‌దులుగా నీటిని తాగ‌డం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News health benefits healthy habits hydration latest news morning water Telugu News water

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.