ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్న ’10-3-2-1-0′ స్లీప్ ఫార్ములా అద్భుతంగా పనిచేస్తోంది. ఈ సూత్రం కేవలం పడుకునే సమయం గురించి మాత్రమే కాకుండా, రోజంతా మనం చేసే పనుల ద్వారా మన మెదడును నిద్రకు ఎలా సిద్ధం చేయాలో వివరిస్తుంది. ఈ పద్ధతిని పాటించడం వల్ల శరీరంలోని అంతర్గత గడియారం (Circadian Rhythm) క్రమబద్ధీకరించబడి, రాత్రిపూట పక్కపై చేరగానే త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.
Elections: తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలషెడ్యూల్ విడుదల
ఈ ఫార్ములా వెనుక ఉన్న అర్థం : –
10 గంటల ముందు (కెఫీన్): నిద్రపోవడానికి 10 గంటల ముందే కాఫీ, టీ వంటి కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. కెఫీన్ మన రక్తంలో కలిసిన తర్వాత దాని ప్రభావం తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఇది మన మెదడులోని ‘అడెనోసిన్’ అనే నిద్రను ప్రేరేపించే రసాయనాన్ని అడ్డుకుంటుంది.
3 గంటల ముందు (ఆహారం & మద్యం): పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం ముగించాలి. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే మద్యం నిద్ర తెప్పిస్తుందని అనుకుంటారు కానీ, అది గాఢ నిద్ర (REM sleep) పట్టనివ్వకుండా మెదడును అశాంతికి గురిచేస్తుంది.
2 గంటల ముందు (పని నుంచి విరామం): ఆఫీసు పనులు లేదా ఒత్తిడి కలిగించే ఆలోచనలను 2 గంటల ముందే ఆపేయాలి. దీనివల్ల మెదడు ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ మోడ్ నుండి విశ్రాంతి మోడ్‌లోకి మారుతుంది.
చివరిగా, అత్యంత కీలకమైనది డిజిటల్ డిటాక్స్ మరియు క్రమశిక్షణ. నిద్రకు గంట ముందు మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు పక్కన పెట్టేయాలి. వీటి నుండి వచ్చే ‘బ్లూ లైట్’ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది, దీనివల్ల కళ్లు అలసిపోయినా మెదడు మేల్కొనే ఉంటుంది. ఇక ఉదయాన్నే అలారం మోగగానే ‘0’ స్నూజ్ పద్ధతిని పాటించాలి. అలారం ఆపి మళ్ళీ కాసేపు పడుకోవడం వల్ల మెదడు కొత్త నిద్ర చక్రం (Sleep Cycle) మొదలుపెడుతుంది, కానీ అది పూర్తి కాకముందే మనం లేవాల్సి రావడంతో రోజంతా అలసటగా, చిరాగ్గా అనిపిస్తుంది. ఈ ఐదు సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తే, ఎటువంటి మందులు లేకుండానే సహజమైన, నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com