పురుషులతో పోలిస్తే మహిళల్లో అల్జీమర్స్ వ్యాధి(Alzheimer’s Disease) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణంపై ఇప్పుడు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు స్పష్టత తీసుకొచ్చారు.
Read also: Disease: అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన
ఒమేగా–3 లోపమే కారణమా?
అల్జీమర్స్ ఉన్న రోగుల రక్తంలోని లిపిడ్స్‌ను పరిశీలించిన పరిశోధకులు కీలక విషయాన్ని గుర్తించారు. అల్జీమర్స్‌తో(Alzheimer’s Disease) బాధపడుతున్న మహిళల్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన లిపిడ్స్ స్థాయి తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ కొవ్వు పదార్థాలు మెదడు ఆరోగ్యానికి అత్యంత అవసరమని, వాటి లోపం అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మహిళలకు నిపుణుల సూచనలు
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మహిళలు రోజువారీ ఆహారంలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అవసరమైతే వైద్యుల సలహాతో ఒమేగా–3 సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: