శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించుకోవడానికి మనం అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. ఇలాంటి వ్యాయామాలల్లో యోగా (Yoga)కూడా ఒకటి. యోగాను ఎవరైనా కూడా చాలా సులభంగా చేయవచ్చు. చిన్న వయసు నుండే పిల్లలకు యోగా చేయడం నేర్పించడం వల్ల వారి ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. రోజూ యోగా (Yoga)చేయడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ విషయాలను యోగా నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Read Also : http://Alzheimer’s Disease: మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!
శరీర నొప్పులు తగ్గుతాయి
ఉదయం చేసే ఈ యోగా మనకు ఒక రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. రోజంతా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పది నిమిషాల పాటు యోగా, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల శరీరం స్థిరంగా ఉంటుంది. మనసు తేలికగా ఉంటుంది. సరళమైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడతాయి. దీంతో శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే రాత్రంతా నిద్రపోవడం వల్ల కండరాలు బిగుతుగా తయారవుతాయి. శరీరం నొప్పులుగా అనిపిస్తుంది. అలాంటి వారు ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీర నొప్పులు తగ్గుతాయి. రోజూ యోగా చేయడం, సులభమైన ఆసనాలు వేయడం వల్ల మానసికంగా ఉత్సాహంగా తయారవుతారు. సులభంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మెదడు పదునుగా తయారవుతుంది.
హార్మోన్ స్థాయిలు అదుపులో
అంతేకాకుండా ఉదయం పూట ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ శరీరంలో ఎక్కువగా ఉంటుంది. రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఈ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరం, మనసు ప్రశాంతంగా ఉంటాయి. రోజూ యోగా చేయడం, శరీరాన్ని వంచడం వంటి కొన్ని ఆసనాలు వేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజంతా అసౌకర్యం లేకుండా ఉంటుంది.
ఆలోచించే గుణం పెరుగుతుంది
ఉదయం పూట యోగా చేయడం వల్ల వెన్నెముక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కూర్చోవడం, నడవడం వంటివి మరింత సహజంగా అనిపిస్తాయి. అలాగే ప్లాంట్ లేదా బోట్ వంటి భంగిమలు చేయడం వల్ల నడుము కింద భాగం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ యోగా చేయడం వల్ల భాగోద్వేగాలు అదుపులో ఉంటాయి. 10 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల త్వరగా స్పందించే గుణం తగ్గుతుంది. దీంతో కోపం, ఆందోళన వంటివి తగ్గి ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. ఈ విధంగా యోగా మన శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: