భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్‌ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పంచుకుంది. “మీ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా ప్రజల తరఫున భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు” అని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు.
Read Also: ‘Cast cutting’: నలభై దాటిన వారిని టార్గెట్ చేస్తున్న లేఆఫ్స్!
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కో రూబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఏడాదిలో ఉమ్మడి లక్ష్యాల సాధనకు కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన ఆకాంక్షించారు. “రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాల్లో మన మధ్య బలమైన సహకారం ఉంది. క్వాడ్ వేదికగా బహుళస్థాయి భాగస్వామ్యంతో ఇరు దేశాలకు, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతోంది” అని రూబియో తన ప్రకటనలో వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: