రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు పట్టుకున్న డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలతో కయ్యాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భారత్‌పై టారిఫ్స్ అంటూ బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ బృందంలోని సభ్యులు కూడా భారత్‌పై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) ముందున్నారు. ఇప్పటికే భారత్‌పై ఈయన పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Read Also: Silver price today : వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?
భారత్‌పై విషం కక్కిన పీటర్ నవారో
రష్యా నుంచి చమురు కొంటున్న భారత్.. దానిని తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకుని లాభాలు గడిస్తోందిని, భారత్ చాకిరేవు దుకాణం నడుపుతోందని నోరు పారేసుకున్నారు పీటర్ నవారో. ఆ తర్వాత మరో మెట్టు ఎక్కి కులాల ప్రస్తావన తీసుకువచ్చారు. భారతీయుల పేరుతో ఆయిల్ కొంటూ.. సంపన్నవర్గాలు లాభాలు గడిస్తున్నాయంటూ ఆరోపించారు. తాజాగా మళ్లీ భారత్‌పై విషం కక్కారు పీటర్ నవారో. భారత్ వంటి దేశాల్లో అమెరికా ఏఐ కంపెనీలు సేవలు అందించడాన్ని ఆయన తప్పుపట్టారు.
వాస్తవ ధర కంటే పది రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు
చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌లు అమెరికా భూభాగంపై వనరులను ఉపయోగిస్తున్నాయని పీటర్ నవారో అన్నారు. ఆయా సంస్థలు అమెరికాలోని విద్యుత్‌ను ఉపయోగించి పనిచేస్తున్నాయని చెప్పారు. కానీ, భారత్ వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో యూజర్లకు సేవలు అందిస్తున్నాయని అన్నారు. భారత్‌లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నారు? అని నవారో ప్రశ్నించారు. అంతేకాకుండా ఇతర దేశాలకు చెందిన సంస్థలు అమెరికాలో వ్యవసాయ భూములను.. వాస్తవ ధర కంటే పది రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: