📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

TG: సమ్మక్క, సారలమ్మ ఆలయ పునరుద్ధరణ

Author Icon By Saritha
Updated: January 5, 2026 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ములుగు జిల్లా : (TG) మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయానికి ఆదివారం హెలికాఫ్టర్లో చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి (Srinivas Reddy), మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మహబూబాజార్ ఎస్పీ కలరిష్, భూపాలపల్లి ఎస్.పి. సిరొశెట్టి సంకీర్, ఐటిడిఏ చిత్ర మిశ్రా, పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పలు శాఖల కు సంబంధించిన అభివృద్ది పనులను పరిశీలించారు. ఇంచన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి బ్యాంబు చికెన్ క్యాంటీన్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి సీతక్కు కలెక్టర్ దివాకర టి.ఎస్ లతో కలిసి ప్రారంభించారు ఆనంతరం మంత్రులు ఎంపి బలరాం నాయకితో కలిసి మేడారం లోని హరిత హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులతో, గుత్తేదారులతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాకారం పిటి బీమ్స్ అమరికా పనులను, గద్దెల రాతి స్తంభాలపై బ్రాకెట్ లను త్వరిత గతిన ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగణ మరియు జాతర సివిల్ వర్క్స్, క్యూ లైన్స్ షేడ్స్ నిర్మాణం మొత్తం జనవరి 12వ తేది వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.

Read also: Siddipet crime: సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

Renovation of the Sammakka and Saralamma temple

జాతరకు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

నూతనంగా నిర్మించిన రహదారులకు ఇరువైపులా సైడ్ బర్ములను ఏర్పాటు చేయాలని పబ్లిక్ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి చూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రాకుండా ఏర్పాటు చేయాలని, మేడారం ప్రాంతం సంక్రాంతి పండుగ ముందు నుంచి జనవరి 31 వరకు విద్యుత్ కాంతుల వెలుగులతో భక్తులకు కనిపించాలని వాటికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబధిత అధికారులకు సూచించారు. జాతర పరిసరాలను జోన్స్, సెక్టార్స్ వారిగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని పారిశుధ్య పనులను చేపట్టాలని అని పనుల విషయం లో నిరక్ష్యం వహిస్తే అధికారులు ఐనా గుత్తేదారులకు ఐనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎం పి బలరాం నాయక్ లు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని, ఆలయ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ…దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో గిరిజనులు సాంప్రదాయ బద్దంగా, కోట్లాదిమంది గిరిజనేతరులు ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అనుకున్న గడువులోగా ఆలయ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి.

ఆలయ పునరుద్ధరణ పనుల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి

ఈనెల 20వ తేదీలోగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి రాత్రి బస చేసి తెల్లవారి ఉదయం ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా ప్రారంభించుకునే కార్యక్రమం చేపట్టబోతున్నాం తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరలో మోలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క ఇక్కడే ఉండి పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నారు.

అమ్మవార్ల దయతో ఆలయ పునరుద్ధరణ పనుల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని చేపట్టిందని, తక్కువ సమయంలో రాతితో 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే విధంగా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాం అని స్పష్టం చేశారు. ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించుకున్నది మొదలుకుని అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మీడియా మిత్రులు ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు వేగవం తంగా సాగే విధంగా సహకరిస్తున్న, సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నారు. అనంతరం హెలికాప్టర్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, ఎం పి బలరాం నాయక్ లు హైదరాబాద్ కు బయలుదేరివెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



Latest News in Telugu Medaram Jatara minister ponguleti srinivas reddy Mulugu District Sammakka Saralamma Temple telangana government Telugu News Temple Renovation Works

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.