📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Siddipet crime: సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: January 5, 2026 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిద్దిపేట(Siddipet crime)లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. హాస్టల్ గదిలో విషపదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా తీసుకున్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(Nimes Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య

Siddipet crime: Student commits suicide at Siddipet Medical College

వివరాల్లోకి వెళితే

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య (2020 బ్యాచ్) సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం హాస్టల్ గదిలో అస్వస్థతకు గురైన ఆమెను గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను నిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ ఐసీయూలో చికిత్స కొనసాగుతుండగా ఆమె ప్రాణాలు విడిచింది.

ఇంటర్న్‌షిప్ ఒత్తిడితో వైద్యురాలి దుర్మరణం?

ఇంటర్న్‌షిప్ బాధ్యతల ఒత్తిడి, అలాగే నీట్ పీజీ పరీక్షల సిద్ధత వంటి కారణాలతో ఆమె మానసిక ఒత్తిడికి లోనై ఉండవచ్చని కాలేజీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన వైద్య విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Google News in Telugu Medical Student Death NIMS Hyderabad Siddipet news Telangana news Woman Doctor Suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.