📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

S Jaishankar: వర్క్‌–లైఫ్ బ్యాలెన్స్‌పై మంత్రి ఏమన్నారంటే?

Author Icon By Aanusha
Updated: January 2, 2026 • 8:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం విస్తృతంగా చర్చకు వస్తోంది. ఉద్యోగ ఒత్తిడి పెరుగుతున్న ఈ కాలంలో, వ్యక్తిగత జీవితం–వృత్తి జీవితం మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అన్న ప్రశ్న అనేక మందిని ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ రంగం నుంచి ప్రభుత్వ విభాగాల వరకు, పని గంటలు, మానసిక ఒత్తిడి, కుటుంబానికి కేటాయించే సమయం వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలుగా మారాయి.

Read also: Sanjeev Kapoor: ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

సంగీతం వినడం, పుస్తకాలు చదవడం

ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్‌… తనకు మిగతా ఉద్యోగుల్లా వారాంతపు సెలవులు ఉండవని స్పష్టం చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు షెడ్యూల్‌ వేసుకుని పనిచేయడం తన వృత్తిలో సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలకు టైమ్‌ టేబుల్‌ ఉండదని,

ప్రపంచంలోని దేశాలు వేర్వేరు టైమ్‌ జోన్లలో ఉండటంతో ఎప్పుడైనా పని చేయాల్సి వస్తుందని వివరించారు. తన రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నానన్నారు. విశ్రాంతి కోసం సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, క్రీడల్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం వంటి అలవాట్లు తనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.

Jaishankar made interesting remarks on work-life balance

డిటాక్స్‌ కావాల్సిన అవసరం లేదు

ఈ అలవాట్ల వల్ల ప్రపంచంతో అనుసంధానమై ఉండగలుగుతున్నానని, అదే తనకు వర్క్‌ – లైఫ్ బ్యాలెన్స్‌ను ఇస్తోందని తెలిపారు. ప్రత్యేకంగా బ్రేక్‌ తీసుకోవడం లేదా డిటాక్స్‌ కావాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్న జైశంకర్‌ (S Jaishankar)… ఈ విధానంతో తన జీవితం సహజంగానే కొనసాగుతోందన్నారు.

అయితే ఈ అభిప్రాయాలు ఇంట్లో అందరికీ నచ్చవని నవ్వుతూ చెప్పారు. తన భార్య కూడా ఇక్కడే ఉన్నారని, ఈ విషయంపై ఆమె తనతో విభేదించే అవకాశం ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. జైశంకర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు విద్యార్థులతో పాటు సోషల్‌ మీడియాలోనూ చర్చకు దారి తీశాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Indian Foreign Minister latest news S Jaishankar Telugu News Work Life Balance Workplace Stress

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.