📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Iran: నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

Author Icon By Vanipushpa
Updated: January 14, 2026 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులను ఉరితీసే చర్యలకు పాల్పడితే అమెరికా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ట్రంప్ స్పందించారు.”ఉరి శిక్షల గురించి నేను ఇప్పటివరకు వినలేదు. కానీ అలా చేస్తే… మీరు కొన్ని పరిణామాలు చూడాల్సి ఉంటుంది. ఇరాన్ అటువంటి చర్యలకు దిగితే మేము చాలా కఠినంగా స్పందిస్తాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీం నేత ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసనలు కొనసాగించాలని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. నిరసనకారులకు అవసరమైన సహాయం అందుతోందని కూడా ఆయన తెలిపారు. నిరసనకారులపై హింస ఆపేంత వరకు ఇరాన్ అధికారులతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసిన ట్రంప్, ఇప్పటికే నిర్ణయించిన సమావేశాలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ 28 నుంచి ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.

Read Also: International Flights:ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్

Iran: నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

2 వేల మంది నిరసనకారులు మృతి

కాగా ఇరాన్‌ దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి దిగారు.మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా ఉగ్రరూపం దాల్చింది. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.అధికారిక లెక్కల ప్రకారం సుమారు 2 వేల మంది నిరసనకారులు మృతి చెందగా, అంతర్జాతీయ మీడియా అంచనాల ప్రకారం ఈ సంఖ్య 12 వేల వరకు ఉండవచ్చని సమాచారం. టెహ్రాన్ నగర వీధుల్లో అనేక చోట్ల మృతదేహాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డజన్ల కొద్దీ భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి.

అంతర్జాతీయ భద్రతకు ముప్పు: రష్యా

మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితి, ప్రపంచ అంతర్జాతీయ భద్రతకు దాని వల్ల కలిగే వినాశకరమైన పరిణామాల గురించి అమెరికా తెలుసుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇరాన్‌లో డోనాల్డ్ ట్రంప్ నిరసనకారులను రెచ్చగొట్టడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం జరిగే అవకాశాన్ని రేకెత్తించింది. ట్రంప్‌ నిరసనకారులకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. కాగా ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ట్రంప్ బాహ్య జోక్యాన్ని రష్యా ఖండించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump protests support foreign interference claims geopolitical tensions international protests Russia concern Telugu News online Telugu News Today US Russia relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.