దౌత్యపరమైన చర్చలు, వ్యూహాత్మక ఒప్పందాలు ఒక ఎత్తయితే.. భారతీయుల మనసు గెలుచుకోవడం మరో ఎత్తు. మన దేశానికి వచ్చిన ఎంతో మంది ఇతర దేశాల నేతలు మన మనసు గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చంగా అలాంటి ప్రయత్నమే చేసి.. అందరి మనసు గెలుచుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Macron). ముఖ్యంగా తన మూడు రోజుల భారత పర్యటనను అత్యంత వినూత్నంగా, ఒక సినీ ఫక్కీలో ముగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పర్యటనలోని మధుర జ్ఞాపకాలను ఒక వీడియోగా మలిచి.. దానికి మన బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన దురంధర్ సినిమాలోని ఓ పాటు మ్యూజిక్ ట్రాక్‌ను వేశారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also: Raebareli School Bus Accident: స్కూల్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు
వైరల్ అవుతున్న మెక్రాన్ వీడియో..
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఈ వీడియో 43 సెకన్ల నిడివి కల్గి ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఈ వీడియోకు నేపథ్యంగా హిందీ బ్లాక్ బస్టర్ సినిమా దురంధర్‌లోని “నా దే దిల్ పరదేశీ ను” అనే పాపులర్ సాంగ్‌ను ఉపయోగించారు. ఈ వీడియోలో మెక్రాన్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన భేటీలు, తనకు లభించిన ఘన స్వాగతం, ఆలయ సందర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను చూపించారు. అంతేకాకుండా ముంబయి వీధుల్లో ఆయన చేసిన జాగింగ్ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వీడియోతో పాటు “ధన్యవాదాలు భారత్” అంటూ ఆ ఆయన రాసిన నోట్ అందరినీ మరింతగా అలరిస్తోంది.
కేవలం వీడియోలతోనే కాకుండా మెక్రాన్ పర్యటన దౌత్యపరంగానూ అత్యంత విజయవంతమైంది. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొన్న ఆయన.. భారత్‌తో ఉన్న సంబంధాలు ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉన్నాయని కొనియాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు వ్యూహాత్మక రంగాల్లో కలిసి పని చేయడానికి రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ఆయన ప్రశంసించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: