కృష్ణా జిల్లా(Krishna crime) గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)లో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య
ట్రాక్టర్ అదుపు తప్పి కిందపడి యువకుడు మృతి
ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన విమానం లగేజీని ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ట్రాక్టర్ నడుపుతున్న ఆదిత్య ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. ఈ ఘటనలో అతడు వాహనం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన విమానాశ్రయంలో విషాదాన్ని నింపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: