📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Israel: ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం?

Author Icon By Vanipushpa
Updated: January 16, 2026 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వం అణ్వాయుధ పరీక్షలు చేయడం వల్లే ఈ భూకంపం వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. డొమినాకు సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, బీర్షెబా వంటి నగరాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇది సహజంగా వచ్చిన భూకంపం కాదని ఇజ్రాయెల్ (Israel) రహస్యంగా నిర్వహించిన అణ్వాయుధా పరీక్షల ఫలితమని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. దీనిపై కొందరు నిపుణలు పలు కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవానికి సహజ సిద్ధంగా వచ్చే భూకంపాలకు, అణు పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనలకు మధ్య తేడా ఉంటుంది. అణు పరీక్ష జరిగితే ‘సిస్మోగ్రాఫ్’ మీద వచ్చే గ్రాఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ప్రారంభంలోనే భారీ పీక్ పాయింట్‌కి చేరుతుంది. అయినప్పటికీ ఈ ఘటనలో నమోదైన తరంగాలు మాత్రం సాధారణ భూకంప తరంగాలనే పోలి ఉంటాయి.

Read Also: GoldLoans: కేంద్ర బడ్జెట్ 2026లో బంగారు రుణాలపై కీలక నిర్ణయాలు?

Israel: ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం?

‘సిరియన్-ఆఫ్రికన్ రిఫ్ట్‌పై ఉంది

ఇజ్రాయెల్ విషయంలో చూసుకుంటే అక్కడి భౌగోళిక ప్రాంతం ‘సిరియన్-ఆఫ్రికన్ రిఫ్ట్‌పై ఉంది. ఇది భౌగోళికంగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉన్న యాక్టివ్‌ జోన్‌. అందువల్ల ఇక్కడ 4.0 నుంచి 4.5 తీవ్రతతో భూకంపాలు సంభవించడం సాధారణమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ హోమ్‌ ఫ్రంట్ కమాండ్ అండ్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపం వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేశాయి. గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ కూడా న్యూక్లియర్ ఆయుధాలు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇటీవల ట్రంప్ కూడా ఇరాన్ అణు కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తే, తక్షణమే సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద కూడా 90 నుండి 200 వరకు అణ్వాయుధాలు ఉండోచ్చని అంతర్జాతీయ నిఘా సంస్థలు, సైనిక నిపుణుల అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Earthquake latest news global security concerns Israel breaking news Israel earthquake Middle East News Nuclear test suspicion Seismic Activity Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.