📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Illegal Belt Shops: అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

Author Icon By Siva Prasad
Updated: February 6, 2026 • 12:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Illegal Belt Shops: మద్యం దుకాణాల్లో అధిక ధరలు, ఆపై అక్రమ బెల్టు షాపులు నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. అడుగడుగునా బెల్టు షాపులు, సందు సందుల్లో అక్రమ మద్యం దుకాణాలు సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి. లైసెన్సెడ్ షాపులు కంటే అధిక ధరలకి మద్యం అమ్మకాలు ఆయా బెల్టు షాపుల్లో సాగుతున్నాయన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా మద్యం షాపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాటిల్ పై ఎంఆర్పీ కంటే పది రూపాయలు అదనంగా అమ్మకాలు సాగిస్తున్నా అధికారులు కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Bar License Allocation: నెల్లూరు జిల్లా లో 21 బార్ లకు లైసెన్స్

అధికారుల మౌనంపై విమర్శలు

నేతల అండదండలు, ఆమ్యామ్యాలకు అలవాటు పడి అధికారులు బెల్టు షాపులు నియంత్రించేందుకు ముందుకు వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని చోట్లా బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నాయి. మద్యం షాపుల నుండే మద్యం ఆయా బెల్టు షాపులకి యథేచ్ఛగా రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మిన్నకుండిపోతుండటంతో అధికారులు, షాపు యజమానులు ఒక్కటై ఈ అక్రమానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అధికారులు మౌనం వహిస్తున్నారని ఆక్షేపణలు ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి.

షాపు యజమానుల సిండికేట్

అన్ని ప్రాంతాల్లోనూ, ఆయా షాపు యజమానులు తమకు అనుకున్నంత వ్యాపారం జరగడం కోసం బెల్టు షాపులకి మద్యం(Illegal Belt Shops) అమ్మకాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే షాపుల నిర్వహణ భారం పెరిగిందని, నష్టాల్లో షాపులు నడుస్తున్నాయని, లాభాల కోసం ఎంఆర్పీ కంటే కొంత పెంచక తప్పదని షాపు యజమానులు పేర్కొంటూ అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని సిబ్బంది పేర్కొంటున్నారు. మద్యం షాపు యజమానులు అంతా సిండికేట్ గా ఏర్పడి అన్ని షాపుల్లోనూ ఒకే మద్యం పాలసీ నడిపిస్తూ మద్యం ప్రియులను పిండేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ఉల్లంఘన – క్షేత్రస్థాయి పరిస్థితి

అన్ని చోట్లా ఇదే విధానం, అవే అదనపు ధరలు, అనుమతులు లేని బెల్టు షాపుల నిర్వహణ నిత్యకృత్యమైందన్నది జగద్వితం. అక్రమ బెల్టు షాపులు నిర్వహిస్తే సహించేది లేదు, అటువంటి వారిపై చర్యలు తప్పవు, లైసెన్స్ రద్దు చేస్తామనే నేతల ప్రకటనలు వట్టి బూటకమన్నది క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే ఇట్టే ద్యోతకమవుతోంది. ఎంఆర్పీ ధరలకు మద్యం అమ్మకాలు జరపాలన్న నిబంధన తుంగలోకి తొక్కినా అధికారులు కిమ్మనకపోవడంలో ఆంతర్యమేమిటో అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు బెల్టు షాపుల నియంత్రణకు ప్రయత్నిస్తారని, ఎంఆర్పీ ధరలకు మద్యం అమ్మకాలు జరిపిస్తారని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Alcohol Overpricing Belt Shops in Andhra Pradesh Corruption in Liquor Sales Excise Department Excise Department Corruption Illegal Belt Shops Illegal Liquor Transport Liquor Belt Shops News Liquor High Prices Liquor Mafia Liquor prices Liquor Syndicate MRP Price Hike MRP Violation in Wine Shops MRP Violations Public Grievances on Liquor Wine Shop License Cancellation Wine Shop Mafia Wine Shop Syndicate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.