దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు, పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న ‘జననాయగన్’ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది.
Read also: Mowgli Movie: ఓటీటీలోకి వచ్చిన మోగ్లీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల
రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేయడంతో సినిమాపై హైప్ రోజురోజుకు పెరుగుతోంది.
ఇందులో బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబి డియోల్‌ని బాలీవుడ్ సరిగా ఉపయోగించుకోలేదని, అతన్ని హిందీ ఇండస్ట్రీ ఎలా వదిలేసిందో అర్థం కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిస్ట్‌గా అతని ప్రొటెన్షియాలిటీని సరిగా వాడుకోలేదని విమర్శలు గుప్పించారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.325 కోట్లు దాటినట్టుగా సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: