📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన యూరోపియన్ దేశాలు

Author Icon By Vanipushpa
Updated: January 17, 2026 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్రీన్‌లాండ్‌పై పెత్తనం చెలాయించాలనే అమెరికా ఆసక్తి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన టారిఫ్స్ ప్రకటన ఆందోళనకరంగా మారింది. ఈ ఆర్కిటిక్‌ దీవిపై అమెరికా నియంత్రణకు సహకరించని దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైట్‌ హౌస్‌లో నిర్వహించిన హెల్త్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌.. అమెరికా దేశ భద్రతకు గ్రీన్‌లాండ్‌ (Greenland) అత్యంత కీలకమని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం రష్యా, చైనా తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నాయని, దీని వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఆరోపణలను రష్యా ఖండిస్తూ.. ఆర్కిటిక్‌ ప్రాంతాన్ని సైనికీకరించడం ప్రపంచ శాంతికి ప్రమాదకరమని హెచ్చరించింది. ఇదే సమయంలో డెన్మార్క్‌కు మద్దతుగా పలు యూరోపియన్‌ దేశాలు తమ సైనిక దళాలను గ్రీన్‌లాండ్‌కు పంపించాయి.

Read Also: US Iran strike threat : ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయమా? ట్రంప్ గతం ఏం చెబుతోంది?

US: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన యూరోపియన్ దేశాలు

ఘర్షణ యుగాంతానికి దారి తీసే ప్రమాదం

గురువారం కూడా ఈ దళాల రాక కొనసాగడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో సూచిస్తోంది. డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ ఆర్కిటిక్‌ ద్వీపం భవిష్యత్తుపై అమెరికా, యూరోపియన్‌ మిత్రదేశాల మధ్య మౌలిక అంగీకారం లేదనే విషయం స్పష్టమవుతోంది. నాటో ప్రత్యక్ష కమాండ్‌కు వెలుపల ఈ విధంగా యూరోపియన్‌ దేశాలు సంయుక్తంగా సైనిక చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్‌ ఆర్కిటిక్‌ ఎండ్యురెన్స్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని యూరోపియన్ దేశాలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌ 15 మంది మౌంటెయిన్‌ స్పెషలిస్టులతో కూడిన బృందాన్ని పంపించింది. జర్మనీ 13 మంది రికనయిస్సెన్స్‌ నిపుణులతో కూడిన బృందాన్ని గ్రీన్‌లాండ్‌కు తరలించింది. యూకే ఒక అధికారిని, నార్వే ఇద్దర్ని, స్వీడన్‌ ముగ్గుర్ని పంపి ఈ ఆపరేషన్‌కు మద్దతు తెలిపాయి. గ్రీన్‌లాండ్‌లో యూరోపియన్‌ దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. అమెరికా చేస్తున్న ఆధిపత్యంపై రష్యా, పోలండ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. Greenland కోసం జరుగుతున్న ఈ ఘర్షణ యుగాంతానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Denmark Greenland issue Donald Trump Greenland controversy European countries warning Trump Greenland issue Greenland sovereignty Telugu News online Telugu News Today US Europe relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.