📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

China population: గర్భనిరోధక ధరలు అమాంతంగా పెంచేసిన చైనా

Author Icon By Tejaswini Y
Updated: January 3, 2026 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన చైనాలో జనన రేటు(China population) క్రమంగా తగ్గుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా పెంపునకు ప్రోత్సాహక చర్యలపై దృష్టి సారించిన చైనా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న కొన్ని పన్ను మినహాయింపులను రద్దు చేయడంతో గర్భనిరోధక సాధనాల ధరలు పెరిగాయి.

Read Also: Amazon: హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

China population: China has drastically increased contraceptive prices

జనవరి 1 నుంచి గర్భనిరోధక మాత్రలు, కండోమ్లు వంటి ఉత్పత్తులపై 13 శాతం విలువ ఆధారిత పన్ను (VAT) అమల్లోకి వచ్చింది. దీంతో ఇవి వినియోగించే వారికి అదనపు ఆర్థిక భారం పడుతోంది. జననాన్ని తగ్గించే సాధనాలపై రాయితీలను తొలగించడం ద్వారా కుటుంబ విస్తరణకు పరోక్షంగా ప్రోత్సాహం ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

పెళ్లి–పిల్లలపై ఆసక్తి తగ్గడంతో చైనా ప్రభుత్వం

చైనాలో ఇటీవల కాలంలో యువత పెళ్లిని ఆలస్యం(Marriage delay) చేయడం, పిల్లలను కనాలనే ఆసక్తి(Family planning) తగ్గడం ప్రధాన సమస్యగా మారింది. పిల్లల విద్య, వైద్యం, సంరక్షణ ఖర్చులు అధికంగా ఉండటం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి, జీవన వ్యయాలు పెరగడం వంటి కారణాలతో చాలా మంది ఒకే పిల్లతోనే పరిమితమవుతున్నారు లేదా పిల్లలు లేకుండా జీవించడానికి మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భవిష్యత్తులో భారీ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం పిల్లల పెంపకానికి సబ్సిడీలు, పన్ను రాయితీలు, వివాహానికి ఆర్థిక ప్రోత్సాహకాలు, యువతకు లవ్ ఎడ్యుకేషన్ వంటి పలు విధానాలను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. జనాభా సమతుల్యతను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aging population China Birth rate fall China birth rate China population decline China VAT Contraceptive tax Population crisis China

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.