📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Bangladesh: భయం గుప్పిట్లో దేశం.. హసీనా కీలక వ్యాఖ్యలు

Author Icon By Tejaswini Y
Updated: January 2, 2026 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆమె బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఒక భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం దేశం భయం గుప్పిట్లో ఉందని, ప్రజలను దోపిడీదారులు, బందీలుగా చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.

Read also: Switzerland: రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం

హసీనా సందేశాన్ని ఆమె పార్టీ అయిన ‘అవామీ లీగ్’ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. హసీనా తన సందేశంలో యూనస్ ప్రభుత్వం(Yunus government) తీరును ఎండగట్టారు. ‘దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నిన వారి నిజస్వరూపాలు ఇప్పుడు బయటపడ్డాయి. వారి ముసుగులు తొలగిపోయాయి. అక్రమ దోపిడీదారులు ఇప్పుడు మమ్మల్ని బందీలుగా చేసుకున్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు పనిచేస్తున్నారు. అపరిమితమైన అవినీతి, అబద్ధాలతో దేశాన్ని చీకటిలో నెట్టేస్తున్నారు’ అని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశరక్షణ కోసం ప్రజలందరూ ఐక్యం కావాలి

ఇకనైనా పరిస్థితులు మరింత దిగజారకుండా జాగ్రత్త పడాలని హసీనా యూనస్ కు సూచించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలందరూ దేశాన్ని రక్షించుకునేందుకు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారని. ఏ దేశం కూడా బంగ్లాదేశ్ ను గౌరవించడం లేదని అన్నారు. తమ పార్టీ అధీకారంలో ఉన్నప్పుడు ప్రజలు కలిసిమెలసి ఉండేవారని కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు హసీనా.

హిందువులు, క్రైస్తవులే టార్గెట్: హసీనా

మరోవైపు అవామీ లీగ్ పార్టీ సోషల్ మీడియా వేదికగా మైనారిటీల రక్షణపై సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ‘రాడికల్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత దేశంలో హింస చెలరేగింది. ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. క్రిస్మస్ పండుగ రోజు వారిని భయభ్రాంతులకు గురిచేశారు. చర్చిలు, మిషనరీ పాఠశాలలకు బెదిరింపు లేఖలు పంపారు. మైనారిటీలను ‘రాజకీయ శత్రువులు’గా, ‘ఇస్లాం వ్యతిరేకులు’గా ముద్ర వేస్తున్నారని ||అవామీ లీగ్ ఆరోపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bangladesh politics Former Bangladesh PM Hasina Comments Muhammad Yunus Government Sheikh Hasina

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.