AP Tomato prices: టమాటా రైతులను అతి తక్కువ ధరలు కుంగదీస్తున్నాయి. మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోవడంతో సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలోని ఆస్పరి, హొళగుంద ప్రాంతాల్లో కేజీ టమాటా ధర కేవలం రూ.5 కి చేరుకోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ
రవాణా ఖర్చులు కూడా రాకపోవడం
కనీసం మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో, చేసేదేమీ లేక పండించిన పంటను రోడ్లపైనే పారబోస్తున్నారు. అటు పత్తికొండ మార్కెట్(Pathikonda Market)లోనూ టమాటా కొనుగోళ్లు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. కేవలం ఏపీలోనే కాకుండా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా టమాటా రైతులు ఇదే విధమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: