📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

AP Government: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: కె.ఎస్. విశ్వనాథన్

Author Icon By Rajitha
Updated: January 2, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : సమయం ఆదాతోపాటు సులభతరంగా పనిచేయడానికి ఆధునిక సాంకేతికతను ఉద్యోగులు ఉపయోగించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. స్థానిక పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణం ఎన్టీఆర్ పరిపాలనా భవనం రెండో అంతస్థులోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్లో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఉద్యోగులతో కలిసి కేక్ కోశారు. ఈ సందర్భంగా సంచాలకులు విశ్వనాథన్ ఉద్యోగులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Read also: TTD: మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

We must embrace new technologies

చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటి వాటిని అందిపుచ్చుకోవాలని

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలంతోపాటు ఉద్యోగులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన కృత్రిమ మేథ (ఏఐ), (AI) చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటి వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల సమయం ఆదాతోపాటు పనిని సులభతరంగా చేయొచ్చన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా ఈ శాఖలో చేరి స్వల్పకాలమే అయ్యిందని, గతంలో కంటే ఉద్యోగులు తమ పనితీరులో మెరుగైన ఫలితాలు కనపర్చారని కితాబిచ్చారు. ప్రెస్ రిలీజ్లకే పరిమితం కాకుండా, కొత్త ప్రచార పద్ధతులను అవలంబించాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనకు

ప్రతి ఉద్యోగి కొత్త విషయాలను నేర్చుకుంటూ సమాచార శాఖ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ముందుకెళ్లడం వల్ల శాఖ మరింత బలోపేతమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనకు చేరువకాగలమన్నారు. శాఖలో సిబ్బంది కొరత ఉన్నా, కొత్త జిల్లాలు ఏర్పడటంతో పని భారం పెరిగినా అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందితోనే విజయవంతంగా తమ విధులు నిర్వర్తించడం అభినందనీయమని సంచాలకులు కే.ఎస్. విశ్వనాథన్ అన్నారు. కార్యక్రమంలో అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత, డైరెక్టర్లు పి. కిరణ్ ఐ. సూర్యచంద్రరావు, సిఐఈ ఓ. మధుసూదన, ఆరఈ డాక్టర్. టి. నాగరాజ, డిప్యూటీ డైరెక్టర్లు బి. పూర్ణచంద్రరావు, పి. వెంకట్రాజ్ గౌడ్, డి. రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు పి. రాజశేఖర్, ఏఎస్ వీరభద్రరావు, కె.నారాయణ రెడ్డి, కె. తిరుపాలయ్య, ఎస్వీ మోహన్ రావు, ఏవో పి. సుదర్శనరావు, జేఈవో నాగరాజు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Information Department AP KS Vishwanathan latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.