AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సహకారం కోసం ‘ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ’ పథకాన్ని మార్చి నెలలో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహ అవసరాలకు రుణం పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ స్కీమ్ కింద రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కేవలం పావలా వడ్డీతో ఈ రుణాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. తీసుకున్న మొత్తాన్ని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Read Also:AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?
అర్హతలు, అవసరమైన పత్రాలు
ఈ పథకానికి అర్హత పొందాలంటే వివాహానికి సంబంధించిన లగ్నపత్రికతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, పెళ్లి ఖర్చుల అంచనాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత రుణ మంజూరు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, పెళ్లి ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: