అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి తన పన్నుల అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న అధునాతన కంప్యూటింగ్ చిప్స్ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తూ బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. ఎన్విడియా (Nvidia)కు చెందిన అత్యంత శక్తివంతమైన H200 ఏఐ ప్రాసెసర్, ఏఎండీ (AMD) కి చెందిన MI325X సెమీకండక్టర్ వంటి హై-ఎండ్ చిప్స్‌పై ఈ పన్ను భారం పడనుంది. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా జాతీయ భద్రతా కారణాలు ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం అమెరికా తన అవసరాలకు సరిపడా చిప్స్‌లో కేవలం 10 శాతం మాత్రమే స్వదేశంలో తయారు చేస్తోంది. మిగిలిన 90 శాతం అవసరాల కోసం విదేశాలపై ఆధార పడుతోంది. ఈ తరహా విదేశీ ఆధారిత విధానం ఆర్థికంగా, రక్షణ పరంగా అమెరికాకు పెను ముప్పుగా మారుతోందని ట్రంప్ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: India Exports: 9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు
మార్కెట్‌లో పోటీతత్వంపై కూడా ప్రభావం
అమెరికాకు చెందిన ఎన్విడియా, ఏఎండీ, ఇంటెల్ వంటి సంస్థలు చిప్స్‌ను డిజైన్ చేస్తున్నప్పటికీ.. వాటి తయారీ మాత్రం ఎక్కువగా విదేశాల్లోనే జరుగుతోంది. ముఖ్యంగా తైవాన్ సెమీ కండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కో (TSMC) వంటి సంస్థల ద్వారా జరుగుతోంది. ఇప్పుడు విధించిన 25 శాతం సుంకం వల్ల ఈ కంపెనీల లాభాలపై ప్రభావం పడటంతో పాటు మార్కెట్‌లో పోటీతత్వంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ సుంకాల విధింపులో ట్రంప్ కొన్ని తెలివైన మినహాయింపులు కూడా ఇచ్చారు. అమెరికాలోని డేటా సెంటర్లు (AI చిప్స్‌ను భారీగా వాడేవి), స్టార్టప్‌లు, ప్రభుత్వ అవసరాల కోసం దిగుమతి చేసుకునే చిప్స్‌కు ఈ పన్ను నుంచి వెసులుబాటు కల్పించారు. అలాగే వినియోగదారుల అప్లికేషన్లు, పౌర పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ సుంకం వర్తించదు. ఇదిలా ఉండగా.. కేవలం చిప్స్‌పై మాత్రమే కాకుండా డ్రగ్స్ (మందుల) పై 100 శాతం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించి వాణిజ్య ప్రపంచంలో అనిశ్చితిని సృష్టించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: