తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) అధికారిక ప్రకటన మేరకు గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు మార్చి 10న విడుదల చేయనున్నారు. అయితే, ఈ రోజు విడుదల అయ్యే ఫలితాల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు మాత్రమే వెల్లడవుతాయి. తదనంతరం, అభ్యర్థులకు రీకౌంటింగ్ అవకాశాన్ని కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు మార్చి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా ప్రకటన జారీ చేసింది.

మార్చి 10 న అభ్యర్థుల మెయిన్స్ పరీక్షల మొత్తం స్కోర్ ప్రకటింపు ఆన్‌లైన్ వ్యక్తిగత లాగిన్‌లోప్రతి అభ్యర్థికి ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కులు అందుబాటులో రీకౌంటింగ్ (Recounting) అవకాశం అభ్యర్థులకు 15 రోజుల్లోగా తమ మార్కులను పునఃపరిశీలించుకోవడానికి అవకాశం ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.1000/- ఫీజు రీకౌంటింగ్ అనంతరం తప్పులే ఉన్నట్లయితే మార్పులు చేసి తుది జాబితా విడుదల 1:2 నిష్పత్తిలో తుది జాబితా ధ్రువపత్రాల పరిశీలనకు అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదల రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 1:2 నిష్పత్తిలో తుది జాబితా విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) అనంతరం తుది మెరిట్ జాబితా ప్రకటించనున్నారు. ఎక్కువగా ఊహిస్తున్న టైమ్‌లైన్ మే 2025లో తుది ఎంపిక ప్రక్రియ పూర్తి జూన్ 2025 నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఆఫర్ లెటర్స్. ఫలితాలు చూసేందుకు అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి – www.tspsc.gov.in అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా ప్రతీ పేపర్‌లో సాధించిన మార్కులను చెక్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్ చేయించుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి తుది ఎంపిక పూర్తయ్యే వరకు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలి.
తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తోందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ స్పష్టం చేశారు. కొందరు మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు ఇస్తూ అభ్యర్థులను మోసం చేసే ప్రమాదం ఉందని, అలాంటి వారిని నమ్మొద్దని ఆయన సూచించారు. దళారులు / మోసగాళ్ల మాటలు నమ్మొద్దు ఎవరైనా అక్రమంగా ఉద్యోగం ఇప్పిస్తానని చెబితే వెంటనే ఫిర్యాదు చేయండి ఫిర్యాదులకు టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌లైన్:
99667 00339 vigilance@tspsc.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు మార్చి 10న విడుదల కానుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టీఎస్‌పీఎస్సీ తుది ఎంపికను పారదర్శకంగా పూర్తి చేస్తుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు రీకౌంటింగ్, ధ్రువపత్రాల పరిశీలన వంటి తదుపరి దశల కోసం అప్రమత్తంగా ఉండాలి. తుది ఫలితాలు వచ్చేవరకు అధికారిక వెబ్‌సైట్‌లో అప్డేట్స్ చెక్ చేయడం మంచిది.